English | Telugu

పెట్రోల్ పోస్తుండగా మంటలు.. బాలిక మృతి.. మ‌రో బాలుడికి గాయాలు

బైక్‌లో పెట్రోల్ పోస్తుండగా ప్రమాదవశాత్తూ మంటలు వ్యాపించి బాలిక మృతి చెందింది. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం చక్రాయపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

బైక్‌లో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చెల‌రేగాయి. అవి విస్త‌రించి బాలికకు అంటుకోవడంతో ఆమె శరీరం కాలిపోయింది. కాలిన గాయాలతో బాలిక మృతి చెందింది.

ఈ ప్రమాదంలో మరో బాలులుడు కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అస‌లు పెట్రోల్ పోసేట‌ప్పుడు మంట‌లు ఎందుకు వ‌చ్చాయి. దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. స్థానిక పోలీసులు కేసు న‌మోదు చేసుకొని విచార‌ణ చేప‌ట్టారు.