English | Telugu

పీజీ వైద్య సీట్ల భర్తీకి షెడ్యూల్‌

ఆలిండియా కోటా లో 50 శాతం సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల పరిధిలోనే భ‌ర్తీ చేస్తారు.
ఈ సీట్లకు ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

దేశవ్యాప్తంగా పీజీ వైద్య డిగ్రీ, పీజీ డిప్లొమా సీట్ల భర్తీకి కేంద్రం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలల పరిధిలో మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు జాతీయ కోటాలో ఉంటాయి. ఈ సీట్లకు ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని షెడ్యూల్‌లో పేర్కొంది.

మొత్తం మూడు రౌండ్లలో సీట్ల భర్తీ జరగనుంది. మూడు రౌండ్లలో చివరిదైన మాప్‌ అప్‌ రౌండ్‌ తర్వాత మే 27లోగా సీట్లలో చేరకపోతే వాటిని ఖాళీ సీట్లుగా గుర్తించి మే 31లోగా భర్తీ చేస్తారు.