English | Telugu

కాచిగూడలో మరమ్మతులు పూర్తి :- మధ్యాహ్నం నుండి యథావిధిగా నడవనున్న రైళ్లు 

నిన్నటి ( నవంబర్ 11న ) జరిగిన ప్రమాదం తర్వాత కాచిగూడ రైల్వేస్టేషన్ లో మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ రూట్ లో వెళ్లే అనేక రైళ్లు రద్దయ్యాయి. కానీ ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. మధ్యాహ్నమైతే తప్ప ఏమీ చెప్ప లేని పరిస్థితి లేదు అంటున్నారు రైల్వే అధికారులు. ప్రస్తుతం అక్కడ 300 మంది పనిచేస్తున్నారు. దాదాపు 20 గంటలుగా అక్కడి రైల్వే లైన్ ను పునరుద్ధరించేందుకు అధికారులు పనిచేస్తున్నారు. మొత్తం రెండు వందల మంది సిబ్బంది ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ మరమ్మత్తుల పనిచేస్తుంది.

ఇప్పటికే రైల్వే ట్రాక్ పనులు కొలిక్కి వచ్చినా.. సిగ్నలింగ్ మరియు ఎలట్రిక్ కేబుల్స్ కి సంబంధించి పనులు ఇంకా చేస్తున్నారు.ఈ రోజు ( నవంబర్ 12న ) మధ్యాహ్నం లోగా తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంటుందని రైల్వే శాఖాధికారులు వెల్లడిస్తుతున్నారు. కాచిగూడకు వచ్చేటువంటి దాదాపు 17 రైళ్లను ఇప్పటికే అధికారులు దారి మళ్లించారు. ఈ పనులన్నీ కూడా ట్రాక్ మీద ఉన్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ అలాగే ఎంఎంటీఎస్ రెండింటినీ పట్టాలపై నుండి తొలగించిన తర్వాత ప్రస్తుతం ట్రాక్ కి సంబంధించినటువంటి పనులు చేస్తున్నారు.ఈ ట్రాక్ పనులన్నిటికి కూడా దాదాపు కొలిక్కి వచ్చాయనేది కూడా అధికారులు చెప్తున్నారు.కానీ పైన ఓజీ కేబుల్స్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఓజీ లైన్ సమక్షంలో ఆడిషన్లో ప్రస్తుతం సిగ్నలింగ్ మరియూ టెలికమ్యూ నికేషన్ కి సంబంధించినటువంటి అధికారులు వాటిని సరి చేసే పనిలో ఉన్నారు.ఈ రోజు మధ్యాహ్నంలోగా పరిస్థితి అంతా యధావిధిగా వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.

రైల్వే విభాగానికి సంబంధించి దాదాపు ఎనిమిది మంది అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రస్తుతం పనులను కొనసాగిస్తున్నారు.దాదాపు అరకిలోమీటర్ వరకు ఈ లైన్ పూర్తిగా దెబ్బతిన్న నేపధ్యంలో ప్రస్తుతం ఆ పనులను అధికారులు కొనసాగిస్తూ ట్రాక్ పునరుద్ధరణ పనులు కొలిక్కి తెచ్చే క్రమంలో అధికారులు మునిగిపోయారు.