English | Telugu
మోడీ- పుతిన్- జిన్ పింగ్ కలిస్తే..ఏమవుతుంది???
Updated : Aug 10, 2025
ట్రంప్ అసలు బాధంతా ఇదే. గత అధ్యక్షులకు కేవలం రష్యా మాత్రమే అతి పెద్ద అడ్డంకి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. అప్పటి వరకూ ఆయుధం పట్టని అమెరికా.. పెర్ల్ హార్బర్ ఘటన తర్వాత అణుబాంబు వరకూ ఆయుధాల తయారీ నేర్చుకుంది. ఆపై రష్యాతో పోటీ పడుతూ.. ఇటు ఆయుధాలతో పాటు అటు స్పేస్ లోనూ మున్ముందుకు వెళ్తూ వచ్చింది. ఫైనల్ గా ఇప్పుడు నాసా పేరు ఎక్కువగా వినిపిస్తోంది ప్రపంచంలో. రష్యన్ స్పేస్ గురించి ఎక్కడా ఊసే ఉండదు. దీనంతటికీ కారణం పోటీ.
ఆపై చైనాతో పోటీపడ్డం మొదలైంది అమెరికా. చైనా వరల్డ్ ప్రొడక్షన్ హౌస్ గా ఉంది. పిన్నీసు నుంచి రాకెట్ల వరకూ చైనాపై ఆధారపడకుండా ఈ ప్రపంచం ఏదీ చేయలేదు. ముందుకు వెళ్లలేదు. మొన్న రాహుల్ గాంధీ ఒక స్మార్ట్ టీవీ యూనిట్లోకి వెళ్లి చూడగా తెలిసిందేంటంటే.. కేవలం పై డబ్బాలు తయారు చేయడం స్టిక్కర్లు వేయడం తప్ప మన మేకిన్ ఇండియా ఏమంత ఎఫెక్టివ్ గా లేదని తేల్చి చెప్పారాయన. దానర్ధం ఏంటంటే చైనాను కాదని మనమేం చేయలేక పోతున్నామని. మనమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ విషయంలో ట్రంప్ ఎలాగైనా సరే చైనాతో పోటీ పడదామని ట్రై చేస్తున్నారు.
ఇప్పటికే చైనా ఆర్మీ ప్రపంచంలోనే అతి పెద్దది. దాని త్రివిధ దళాలతో పోల్చితే అమెరికన్ ఆర్మీ జుజుబీ. దీంతో స్మార్ట్ వార్ చేయడమెలా?. అన్నది ప్రాక్టీస్ చేస్తూ వస్తోంది. గత కాలపు అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ప్రవేశ పెట్టిన స్టార్ వార్ తరహాలో గోల్డన్ డోమ్ అనే సేఫ్టీ లైన్ ప్రవేశ పెట్టే యోచన చేస్తున్నారు ట్రంప్ నాయకత్వంలోని అమెరికన్ రక్షణ రంగ నిపుణులు. ఇదే రష్యా సంగతి చూస్తే రష్యా మొత్తం నాశనమైనా కూడా ఆటోమేటిక్ ట్రిగరింగ్ ద్వారా ప్రపంచాన్ని నామరూపాల్లేకుండా చేయగలిగే సత్తా తమ సొంతమని గుర్తు చేస్తోంది ఆ దేశం.
ఇక భారత్ విషయానికి వస్తే.. ఈ దేశాన్ని పాక్ ఉగ్రవాదులు సాయంతో.. కెలికి ఆపై యుధ్దానికి ప్రేరేపించి అటు పిమ్మట ఆయుధ కొనుగోళ్లు చేయిద్దామని చూసింది యూఎస్. తెలివి మీరిన భారత్ పక్కా వ్యూహరచనతో హండ్రడ్ పర్సంట్ స్ట్రయిక్ రేట్ తో.. ఇటు ఉగ్రవాదులను అటు చైనా పీఎల్ 15లు, ఆపైన అమెరికన్ ఎఫ్ 16 లను పడగొట్టి దుమ్ము దులిపేసింది. దీనంతటికీ కారణం వ్యూహరచన. సరిగ్గా పాక్ అణు నిల్వలున్న కిరానా కొండలపై బ్రహ్మోస్ లను వదలడంతో.. అక్కడ పడ్డ దెబ్బ ఇటు పాక్ కి అటు అమెరికాకి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. దీంతో జడుసుకున్న పాక్ అమెరికా కాళ్లు పట్టుకుని.. కాల్పుల విరమణ బేరానికి వచ్చింది.
ఇలా ఎటు నుంచి ఎటు చూసినా ఈ మూడు అగ్రదేశాలు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్నవారే. మొన్నటికి మొన్న.. అమెరికన్ ఎఫ్- 35లను వద్దని రిజెక్ట్ చేసింది భారత్. మనం కూడా దాని పనితీరు కేరళ ట్రివేండ్రం ఎయిర్ పోర్టులో ఆగినపుడు చూసే ఉంటాం. 40 మంది మెకానిక్ లు వచ్చినా కూడా దాన్ని రిపేర్ చేయలేక పోవడంతో.. గ్లోబ్ మాస్టర్ సాయంతో బ్రిటన్ కి ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇక 2018లో తాడ్ లను కొనమని ప్రెషర్ చేసింది యూఎస్. మాకొద్దా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని తెగేసి చెప్పి.. ఎస్ 400 లను కొనుగోలు చేసింది భారత్.
కారణం అమెరికా నమ్మదగిన దేశమేం కాదు. అదే రష్యా ఇటు బ్రహ్మోస్ వంటి మిస్సైళ్ల తయారీకి సాంకేతిక సాయం చేస్తూనే.. అటు తాము యుద్ధంలో ఉండగా కూడా ఎస్ 400 డెలివరీ చేసింది. అంతేనా ఏ చిన్న సైనిక సాయం కావాలన్నా చేస్తుంది. అదే అమెరికా మనం కార్గిల్ వార్ లో ఉండగా.. జీపీఎస్ సిస్టమ్ ని ఆపి హ్యాండ్ ఇచ్చింది. .ఇలాంటి నమ్మక ద్రోహ దేశం వద్ద ఏం కొన్నా సరే మనకేం పెద్ద యూజ్ అవదు.
గతంలో పెంటగాన్ రిపోర్టులను బట్టీ చూస్తే ప్రపంచంలోనే అమెరికా దగ్గర ఆయుధాలు కొనే దేశాల్లో మనం థర్డ్ ప్లేస్ లో ఉండేవారం. కానీ అమెరికా దాని నీచ బుద్ధి బయట పడుతూ వచ్చాక.. మనం ఆయుధాల పరంగా దూరం జరుగుతూ వస్తున్నాం. ప్రస్తుతం ట్రంప్ కోపం కూడా అందుకే. భారత్ రష్యాకు మరింత దగ్గరవుతుంటే పరిస్థితి.. అమెరికాకి మైండ్ పోతోంది. దానికి తోడు మనం ప్రతిదానికీ రష్యా సహకారంతో సొంత సిస్టమ్ తయారు చేసుకుంటూ వస్తున్నాం. ఎస్ 400 తరహాలో ప్రాజెక్ట్ కుషా. ఆపై ఎఫ్ 35 ల లాంటి ఫిఫ్త్ జెన్ ఫైటర్ జెట్స్.. ఇలా ఓన్ ప్రొడక్షన్ మొదలు పెట్టాం.
ఎందుకంటే గత ఆపరేషన్ సిందూర్ లోపాక్ ఇటు అమెరికా అటు చైనా, టర్కీల నుంచి పెద్ద ఎత్తున ఆయుధ సాయం పొందింది. వారంతట వారు తయారు చేసుకోలేక పోవడం వల్ల.. ఆ దేశం చివర్లో బోల్తా కొట్టింది. మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పినట్టు.. ఆయుధం ఉండగానే సరిపోదు. దాన్ని వాడే సామర్ధ్యం కూడా అత్యవసరం. అదెప్పుడు సాధ్యమంటే వాటిని మనమే తయారు చేసుకోవడం వల్ల సగానికి సగం తర్పీదు అయి ఉంటామని అంటారాయన. దానికి తోడు ఆయుధ తయారీలో రష్యన్ మేడ్ మోస్ట్ పర్ఫెక్ట్ కమ్ పవర్ఫుల్. మొన్నటి యుద్ధంలో పాక్ ని మనం కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది ఎస్ 400 లు. ఈ విషయాన్ని తాజాగా మన ఎయిర్ చీఫ్ ఏపీ సీంగ్ సైతం చెప్పుకొచ్చారు.. మనం ఎఫ్ 16లతో సహా ఆరు యుద్ధ విమానాలు పడగొట్టామంటే కారణమదే. ఈ విషయం పాక్ ఒప్పుకోకున్నా ట్రంప్ సైతం అవును నిజమేనన్నారు.
అలాంటి కండీషన్లో రష్యా- భారత్- చైనా అనే ఈ మూడు దేశాలు కలిస్తే సగం ప్రపంచం అటు వైపు మొగ్గుతుంది. మరో సమస్య ఏంటంటే భారత్ కి ఈ మూడు దేశాల్లోనే కాస్త మర్యాదరామన్న లక్షణాలు అధికం. మనం ఎవరినీ యుధానికి ప్రేరేపించం. ఎవరితోనూ యుద్ధం కావాలని కోరుకోం. ఎవరినీ టక్కరి బుద్ధులతో దెబ్బ తీయాలని చూడ్డం. దీంతో ఇప్పటికే భారత్ ని సగం దేశాలు అగ్ర నాయకత్వం వహించమని కోరుకుంటున్నాయ్. ఇదే ట్రంప్ చూడండీ.. రష్యాతో యుద్ధంలో ఉన్న దేశమని కూడా వదలకుండా ఉక్రెయిన్ తో ఏ విదంగా ఖనిజ తవ్వకాల ఒప్పందం చేసుకున్నారో. ఆపై భారత్ తో ఘర్షణలో ఉన్న టైంలోనే పాక్ ద్వారా తమ కుటుంబ కంపెనీలో పెట్టుబడులు పెట్టించుకున్నారు. ఇదంతా ప్రపంచం చూస్తూనే ఉంది.
దానికి తోడు బ్రిక్ దేశాలన్నీటికీ ఒక భరోసా అందించేలా అత్యంత చౌక ధరలకే మనం ఆయుధాల తయారీతో పాటు సరఫరా కూడా చేస్తున్నాం. ఇక్కడే ట్రంప్ కి భారత్ అంటే ఒళ్లు మండిపోతోంది. ఆయా అమెరికన్ కంపెనీల నుంచి మన వాళ్లను వాష్ అవుట్ చేయమంటున్నారాయన. ఇంకా సుంకాల మోత మోగిస్తామని చెప్పుకొస్తున్నారు.
ప్రపంచమంతా ట్రంప్ భారత్ ని ఏదో భయపెట్టి ఇరకాటంలో పెడుతున్నాడని అంటున్నారుగానీ.. దీని ప్రభావం వచ్చే రోజుల్లో బలంగా ఉండనుంది. డాలర్ ద్వారా లావాదేవీలను మానేసి బ్రిక్ దేశాలు తమకు తాము స్వయంగా ఒక కరెన్సీ ఏర్పాటు చేసుకుని తద్వారా.. చెల్లింపులు చేసుకునేలా తెలుస్తోంది. దీంతో సగం ప్రపంచం డాలర్ ని వాడ్డం తగ్గించేస్తాయి. దీంతో అమెరికా నడ్డి విరిగి నట్టేట్లో పడ్డం ఖాయం.
ఇప్పటికే అమెరికా ఒక కన్జ్యూమర్ బేస్డ్ కంట్రీ.. ఆ దేశ ప్రజల్లో అత్యధిక శాతం క్రెడిట్ కార్డులను బేస్ చేసుకుని బతుకుతుంటారు. అంతే కాదు.. ప్రభుత్వాలు కూడా యధేచ్చగా రుణాల మాఫీ చేస్తూ ఉంటుంది. ఇంత వెసలుబాటుకు కారణం అమెరికన్ డాలర్ లో ప్రపంచంలోని ప్రతి చెల్లింపు జరుగుతుంది కాబట్టి.. ఆ నిల్వలు ఆ దేశం చెంత అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి. దానికి తోడు ప్రపంచంలో ఉన్న ప్రతి వనరుపై గుత్తాధిపత్యం వహించి ఆపై ఆయా దేశాలకు ఇవ్వాల్సిన మొత్తాలు కూడా.. తమ ట్రెజరీల్లో దాచుకుంటుంది యూఎస్.
ఒక వేళ డాలర్ చెల్లింపులను కంట్రోల్ చేయగలిగితే.. దెబ్బకు అమెరికా ఆర్ధిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. ఈ విషయం గుర్తించిన బిజినెస్ మెన్ ట్రంప్.. ఒకటే సుంకాల బెదిరింపులకు పాల్పడుతున్నారు. కానీ ఈ ప్రభావం భారత జీడీపీపై పడేది కేవలం పాయింట్ టూ పర్సంటేజీ మాత్రమే.. కాబట్టి ఏం పెద్ద భయపడకూడదన్న కృత నిశ్చయంతో ఉంది. దీంతో పెద్దన్న ట్రంప్ కి లోలోన అణుబాంబులు పడుతన్న చప్పుడు వినిపిస్తోంది.. ఉన్న సిట్యువేషన్ కి తోడు.. ఈ మూడు దేశాల కలయిక అంటేనే హడలెత్తి పోతోంది ట్రంప్ నాయకత్వంలోని అమెరికా.