English | Telugu

హోరాహోరీగా నడుస్తున్న జార్ఖండ్ ఎన్నికల ఫలితాల లెక్కింపు....

జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కోసం నిరీక్షించిన సమయం నేడు రానే వచ్చింది.జార్ఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్, జేఎంఎం కూటమి బీజేపీ మధ్య హోరాహోరీ సాగుతోంది. 81 స్థానాలు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమి బిజెపి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటిపడుతున్నట్లు సమాచారం. మొదట బిజెపి కాస్త వెనుకబడ్డట్టు కనిపించిన రెండో దశ రౌండ్ల నుంచి పుంజుకుంది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా ఆర్జేడీ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.జెఎంఎం నలభై మూడు, కాంగ్రెస్ ,31 ఆర్జెడీ ఏడు స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ ఒంటరిగా 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 52 స్థానాల్లో పోటీ చేయగా, జార్ఖండ్ వికాస్ మోర్చా 81 స్థానాల్లో పోటీ చేశాయి.కానీ ఈ పార్టీల అంత ప్రభావం చూపలేకపోయాయి. గత ఎన్నికల్లో బీజేపీ 39 సీట్లు గెలుచుకోగా, బిజెపి నేత రఘువర్ దాస్ ముఖ్యమంత్రిగా కూడా పగ్గాలు చేపట్టారు.

ఈ సారి ఎన్నికల్లో జంషెడ్ పూర్ నుంచి పోటీ చేసిన రఘువర్ దాస్ ముందంజలోనే ఉన్నారు.జేఎంఎం నేత హేమంత్ సొరేన్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నారు.రెండు జాతీయ పార్టీలతో పాటు నాలుగు ప్రాంతీయ పార్టీ లు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అధికారాన్ని నిలబెట్టు కునేందుకు బిజెపి సాయశక్తులా ప్రయత్నా లు చేసింది. పార్టీ తరుపున మోడీ అమిత్ షా కేంద్ర మంత్రులు సీనియర్ నేతలు జార్ఖండ్ లో ప్రచారం చేశారు. నిరంతరం అనిశ్చిత రాజకీయాలు రాజ్యమేలే జార్ఖండ్ లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఐదేళ్ల ముఖ్య మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిగా రఘువర్ దాస్ రికార్డు సృష్టించారు.ఈ హోరా హోరీ రేసులో కాంగ్రస్ పై కూడా చాలా వరకు ఊహాగానాలు ఉన్నాయి. మరి జార్ఖండ్ లో కమలదళం ఎగరనుందో లేదో అన్న ఉత్కంఠత నేటితో తేలనుంది.