English | Telugu

విపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఈయనేనా?

తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీయే ప్రకటించడంతో విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అదే తమిళనాడు చేందిన డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను ప్రకటించే ఛాన్స్ ఉందని జాతీయ మీడియాలో వార్తలోస్తున్నాయి.

ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగే ప్రతిపక్షాల భేటీలో అభ్యర్థి ఎవరో తేలనుంది.తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్‌డీయే ప్రకటించడంతో, అదే తమిళనాడు నుంచి డీఎంకే అభ్యర్థిని దించడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని విపక్ష కూటమి భావిస్తోంది.

అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈనెల 21వ తేదీతో నామినేషన్ గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకోసం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో కూటమి ఫోర్ల్‌ లీడర్లు సోమవారంనాడు సమావేశమయ్యారు. కూటమి అభ్యర్థిని ఈరోజే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.