English | Telugu
మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత
Updated : Aug 18, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను విజయవాడ సీబీ కోర్టు సోమవారం (ఆగస్టు 18) కొట్టివేసింది.
మధ్యం కుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి, అలాగే విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ల వాదనలు పూర్తికావడంతో వాటిని కోర్టు తిరస్కరించింది. అలాగే ఈ కేసులో వాపెదువరెడ్డి, సత్యప్రసాద్ ల ముందస్తు బెయిలు పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది.