English | Telugu

కరోనా వ్యాక్సిన్ పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ తీపి కబురు.. 

కొద్ది కాలం క్రితం వరకు కరోనాకు వ్యాక్సిన్ అంత తొందరగా వచ్చే అవకాశం లేదని కొన్ని సార్లు.. అసలు కరోనాకు వ్యాక్సిన్ సాధ్యం కాదని మరోసారి ప్రకటించిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(WHO), తాజాగా ఒక శుభవార్త చెప్పింది. ఈ ఏడాది చివరికి అంటే డిసెంబర్ నాటికీ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నామని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ అధనామ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వ్యాక్సిన్ ప్ర‌యోగాలు ఆ దిశగా ఆశలు చిగురించేలా చేస్తున్నాయ‌ని టెడ్రోస్‌ అధనామ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తే.. వాటి పంపిణీ కోసం అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంద‌ని టెడ్రోస్‌ అధనామ్ చెప్పా‌రు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగ పరీక్షల్లో ఉన్నాయని, 2021 ముగిసేలోగా మొత్తం 200 కోట్ల డోస్ లను అందించాలన్న లక్ష్యంతో తాము ప్రణాళికలు రూపొందించామని అయన తెలియజేశారు.