English | Telugu

సబ్ కమిటీ రిపోర్ట్ రెడీ.. బాబు హయాంలో జరిగిన అవకతవకలు బయటపెట్టనున్న వైసీపీ


గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల పై వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తన నివేదిక ను సీఎంకు అందచేసింది. మొత్తం 30 అంశాల పై కమిటీ నివేదిక ఇచ్చింది. నిర్మాణాల భూ కేటాయింపులు ప్రాజెక్టులపై కమిటీ పరిశీలించటమే కాక నివేదిక పై కేబినెట్ చర్చించింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్... నలుగురు మంత్రులు దీనికి సంబంధించిన సబ్ కమిటీలో ఉన్నారు. ఈ సబ్ కమిటీ జూన్ 31వ తేదిన ఏర్పాటు చేయడం జరిగింది.

అప్పటి నుంచి కూడా వివిధ సార్లు భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతం మొదలుపెట్టుకొని అనేక ప్రాంతాల్లో జరిగిన నిర్మాణాలు, వ్యయాలు ఏవైతే ఖర్చు పెట్టరు అవన్నీ కూడా ఒకటి ఒక పూర్తి స్థాయి రిపోర్టును తయారు చేశారు. అమరావతి విషయంలో అవకతవకలు జరిగినట్లు భావిస్తున్నారు. వాటిని కూడా రిపోర్టులో పొందుపర్చిన జరిగినట్టు సమాచారం.గత ప్రభుత్వం పాల్పడిన అనేక అవకతవకలను నిరుపిస్తామని గతంలో నుండే ప్రభుత్వం చెబుతుంది. దీని పై ప్రతిపక్ష నేతలు కూడా సవాల్ చేస్తూ తాము అవినీతి చేస్తున్నామని నిరుపిస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఎటువంటిది నివేదిక కానీ రుజువు చేయలేకపోయారంటూ ఆరోపిస్తున్నారు.దానిపై స్పష్టత అందించేందుకు మరికాసేపట్లో క్యాబినెట్ సమావేశం ముగుస్తున్నట్లు సమాచారం. మరికాసేపట్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.విడుదలైన నివేదిక ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.