English | Telugu
అమరావతి భూముల కొనుగోళ్లపై సీబీఐవిచారణ
Updated : Dec 27, 2019
రాజధానికి సంబంధించి కీలకమైన ప్రకటన వస్తుందని ఎదురు చూస్తున్న నేపథ్యంలో అమరావతిలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని కేబినెట్ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరువాత దీని పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అమరావతి ప్రకటనకు ముందు జరిగిన భూకొనుగోళ్ల పై సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. నాలుగు వేల ఎకరాలు ఎవరెవరు కొన్నారో నివేదికల చాలా స్పష్టంగా పేర్కొంది సబ్ కమిటీ. ఈ నివేదికలో పలువురు టిడిపి నేతల పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఎన్ని కోట్లు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమని ముఖ్యమంత్రి అన్నారని రాజధాని తరలింపు పై మంత్రులకు చాలా సుదీర్ఘంగా వివరించినట్టు సమాచారం.
లక్ష కోట్లలో 10% శాతం వైజాగ్ లో ఖర్చు పెట్టిన కూడా హైదరాబాద్ స్థాయిలో రాజధాని అభివృద్ధి అవుతుందని, రాజధాని మార్పు ఎందుకో ఏమిటో ప్రజలకు చెప్పి చేద్దామని జగన్ చెప్పినట్లు వెల్లడించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో జియన్ రావు కమిటీ నివేదికపై చర్చించారు. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు పై సీఎం మంత్రుల సూచనలు అడిగినట్లు సమాచారం.రాజధాని తరలింపు పై సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.15 రోజుల్లో సబ్ కమిటీ ఏర్పాటు కానుంది. రాజధాని తరలింపు విషయంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు పై మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.