English | Telugu

ఆ వైర‌స్‌ కంటే దేవుడే గొప్ప! అన్న బిష‌ప్ కరోనాతో మృతి!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బ‌కు రెండు మిలియన్ల మంది ఆస్పత్రి పాలయ్యారు. మరో లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌కు కులం, మతం, రంగు, దేశం, ప్రాంతం అంటూ తేడా ఏం లేదు. దీనికి అందరూ ఒక్కటే. అందర్నీ సమానంగా చూస్తోంది ఈ మహమ్మారి.

కరోనాను చూసి ఎవరూ భయపడొద్దని.. దేవుడి కంటే కరోనా గొప్పేం కాదు అంటూ మార్చి 22న ఇవాలజలికల్ చర్చ్.. వ్యవస్థాపకుడైన బిషప్ గెరాల్ట్‌ గ్లెన్‌.. సామూహిక ప్రార్ధనలు నిర్వహించాడు. ఆ ప్రార్ధనల్లో ఈ వైర‌స్‌పై ప్ర‌త్య‌క ప్ర‌సంగం చేశారు. కరోనాను చూసి ఎవరూ భయపడొద్దు. దేవుడి కంటే కరోనా గొప్పేం కాదు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వైరస్‌ కంటే కూడా దేవుడే గొప్ప అని నమ్ముతానంటూ చర్చ్‌కు వచ్చిన వారి ముందు ప్రసగించాడు. అయితే ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన అస్వస్థతకు గురయ్యాడు. చివరకు ఆ వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా వర్జీనియాలోని న్యూ డెలివరెన్స్‌ ఇవాలజలికల్ చర్చ్.. వ్యవస్థాపకుడైన బిషప్ గెరాల్ట్‌ గ్లెన్‌.. కరోనా సోకడంతో మరణించాడు.

ఏప్రిల్ 4న ఆ పాస్టర్‌తో పాటు ఆయన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన కూతురు వెల్లడించింది. ఆ తర్వాత ఇద్దర్నీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే తాజాగా.. ఆ బిషప్ చికిత్స పొందుతూ కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. పాస్టర్ గ్లెన్‌ మరణించిన నేపథ్యంలో.. ఆయన చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను చర్చ్‌ యూట్యూబ్‌ చానల్‌ నుంచి తొలగించింది.