English | Telugu
బ్యాంకుల్లో వున్న ప్రజల డబ్బును ఇలా దోచుకుంటారా?
Updated : May 1, 2020
Lone Waive కంటే Loan Write off ఎందుకు ప్రమాదకరం ఎలా అంటే...
1. Lone waive off లో ఎంత మాఫీ అయిందనే లెక్క ఉంటుంది తద్వార ఖచ్చితమైన లెక్కలతో బ్యాంకులు విధానాల్ని రూపొందిస్తాయి .కానీ Loan write off లో ఇది సాధ్యం కాదు .
2. Loan waiver పొందిన వ్యక్తులు మళ్ళీ loan పొందాలంటే సాంకేతికంగా సాద్యం కాదు .కాని Write off ప్రకటించిన తర్వాత ..దాన్ని Asset Reconstruction company కి గానీ ,DRT కీ గానీ లేదా IBC కి గాని బదిలీ చేసి ...అతి తక్కువ డబ్బుతో ..సెటిల్మెంట్ జరుగుతుంది .తద్వార ఉద్యేశపూర్వక ఎగవేతదారు కాస్త లీగల్ గ తన అప్పును వదిలించుకోని మళ్ళీ రకరకాల పేర్లతో మళ్ళీ అప్పు తీస్కుంటాడు
1. ఇదే లోన్ Write off ని చిన్న అప్పులకు ,రైతులకు ఎందుకు వర్తించరు ?
2. ప్రతి సంవత్సరం జరిగే సాధారణ ప్రక్రియ అన్నప్పుడు ...అదే ప్రక్రియను మిగితావారికి ఎందుకు ఆపాదించరు ?
3. 10 సంవత్సరాల తర్వాత కూడా రైతుల అప్పు అలాగే ఎందుకుంటుంది ?
4. సామన్యుల దగ్గర ముక్కు పిండి వసూల్ చేసే బ్యంకులు ఇలా బాడా దొంగల దగ్గర ఎందుకు వసూల్ చేయలేకపోతుంది ?
5. ఇలా ఉద్యేశ పూర్వక ఎగవేత దార్ల పేర్లు భహిరంగంగా ఎందుకు ప్రకటించలేకపోతున్నరు ?
6. రాజకీయ పార్టీలకు ఒస్తున్న విరాళాల వివరాలు ఎందుకు వెల్లడించరూ ? ఎందుకంటే ఇలా బ్యాంకుల నుండి దోచిన డబ్బులే వారికి విరాళాల రూపంలో అందుతాయి .
7. పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతూ ఎంతమంది ఇలా బ్యంకులకు డబ్బులుఎగ్గొట్టారు ? వారికి సభ్యత్వం అవసరమా ?
8. కాయకష్టం చేస్కోని బ్యంకుల్లో దాచుకున్న డబ్బులను ఇలా దోచేయడం ఎంతవరకు న్యాయం.
అసలు Write off అంటే ఏమిటీ
ఇదివరకే Loss Assets కింద పరిగణించబడి ..ఇంకా తిరిగి రావు అనుకున్న ఆస్థులను ..బ్యాంకులు తమ బ్యలెన్స్ షీట్స్ నుండి తొలగించివేయడం .
అంటే మళ్ళీ ఆ అస్థులను వసూల్ చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటూనే వాటిని తమ బ్యాలెన్స్ షీట్స్ నుండి తొలగిస్తాయి .
దీని వల్ల బ్యాంకులకు ఒచ్చే లాభమేంటీ ?
1. నిరర్థక ఆస్థులకు సంభందించించి "ట్యాక్సు " కట్టాల్సిన పని లేదు ..కాని ఇది ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గిస్తుంది
2. తమ బ్యలెన్స్ షీట్ లో ఎన్నో రోజుల నుండి ఆస్థులుగా పరిగణింపబడి ,ఎలాంటి ఆదాయాన్ని సమకూర్చని ఆస్థులను తొలగించుకుంటాయి .తద్వార తాము వసూల్ చేయలేకపోయామనే అపవాదును తప్పించుకుంటాయి
దీనివల్ల దేశానికి ఒచ్చే నష్టమేమిటీ అంటే!
1. ఇది వరకే loss assets గా పరిగణింపబడి ,ఇప్పుడు Write off కిందికి ఎల్లిన ఈ ఆస్థులు ఇంకా ..దాదాపుగా తిరిగిరానట్టే అని సంకేతికంగా చేతులెత్తేసినట్టూ .
2. దీని మూలంగా ఈ అస్థుల ద్వారా వచ్చే "ట్యాక్సు " ను ప్రభుత్వం కోల్పోయి ,అప్పులు తెచ్చి వడ్డి కట్టాల్సిన పరిస్థిథి ( ఇప్పటికే భారత్ ప్రతి గంటకు 95 కోట్ల అప్పు చేస్తుంది .ఇప్పటీకి భారత్ అప్పు దాదాపుగా 16 లక్ష ల కోట్లు దాటిపోయి ...ఈ సంవత్సరం మనం 7 లక్షల కోట్ల వడ్డీ కట్టాము .
3. బ్యాంకులు తమ Lneding Capacity ని కోల్పోతాయి ..తద్వార మర్కేట్ లో ద్రవ్య సరపర తగ్గి , MSME Sector కి , అవ్యస్థిక్రుత రంగానికి లోన్లు దొరకని పరిస్థితి దాపురించి ,పెట్టుబడులను తగ్గించి ,GDP తగ్గి తద్వార ప్రజల జీవణ ప్రమాణాలు పడిపోతాయి .
4. బ్యాంకులు వద్ద ద్రవ్య లబ్యత లేనందువల్ల ..వడ్డీ రేట్లు పెరిగి ,సామాన్యుడు అప్పు తీస్కోలేని పరిస్థితికి దిగజారుతారు .
5. దీని మూలంగా "బ్యాంకులకు " ప్రభుత్వం మూలధనాన్ని సమకూర్చాలీ ...అదీ కూడా ప్రజల సొమ్మే .
ఈ రకంగా Loan Write Off అనేది సంకేతికంగా లోన్లను రద్ధు చేయకున్నా ,పలు విధాలుగా ప్రజా ధనాన్ని లూటీ చేస్తుంది.