English | Telugu
వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఫైర్!
Updated : Apr 22, 2020
వైసీపీ నేతల తీరుతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల వల్లే కరోనా సామాజిక వ్యాప్తి చెందుతుందని చెప్పారు. కేంద్ర సాయాన్ని కూడా తమ సాయంపై చెప్పుకుంటున్నారని కన్నా మండిపడ్డారు.
ఏపీలో ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకుపోయిందని, వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలకాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఏపి బీజేపీ ఘాటుగా విమర్శలు చేసింది. 20 కోట్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా అమ్ముడుపోయారాని విజయసాయిరెడ్డి ఆరోపించడాన్ని బిజెపి తప్పుపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కు క్షమాపణ చెప్పకపోతే రానున్న కాలం లో తీవ్ర పరిణామాలు తప్పవని బీజేపీ నేతలు హెచ్చరించారు.
ఏ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకులు కరోనా ను అడ్డుపెట్టుకుని కలెక్షన్లు చేస్తున్నారన్నారు.