English | Telugu

బీసీలను నమ్మించి మోసం చేస్తారా?

బీసీ కోటాపై సుప్రీంకు వెళ్ళండి!
ప్రభుత్వం తరఫున ఎస్‌ఎల్‌పీ వేయండి
అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయండి
సి.ఎం. జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు లేఖ‌

బీసీల రిజర్వేషన్‌ పరిరక్షణ కోసం తక్షణం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వచ్చిన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయకుండా.. వారికి 24 శాతం రిజర్వేషన్‌తోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకోవడం పై ఆయ‌న తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

బీసీల రిజర్వేషన్ పై అఖిల పక్ష సమావేశం పిలవకుండా, బీసీ సంఘాలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని చంద్ర‌బాబు త‌ప్పుప‌డుతూ ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ రాశారు.

ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్‌, బీసీ సబ్‌ప్లాన్‌ అంటూ ప్రచారం చేసి.. అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు తగ్గించి వెన్నుముక విరిచేయడం, బీసీలను నమ్మించి మోసం చేయడమేన‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.