English | Telugu

జీసస్ శిలువ తొలగింపుపై దుమారం.. దేవనహళ్లిలో ఉద్రిక్త‌త‌

బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారంటూ ఏసుక్రీస్తు విగ్రహం, కొన్ని శిలువలను స్థానిక మున్సిపల్ అధికారులు తొలగించారు. స్థానిక క్రైస్తవులు అడ్డుపడ్డారు. అధికారులు విగ్రహం, శిలువలను ధ్వంసం చేశారు. జీసస్ విగ్రహాన్ని, శిలువలను నేలమట్టం చేశారు. శిథిలాలను ట్రక్కులో తరించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు ఎలాంటి నోటీసులను కూడా ఇవ్వకుండా విగ్రహాన్ని ఎలా తొలగిస్తారంటూ క్రైస్తవ మత పెద్దలు నిల‌దీసినా అధికారులు ప‌ట్టించుకోలేద‌ట‌. ప్రభుత్వం స్మశాన వాటిక కోసం క్రైస్తవ సంఘాలకు కేటాయించిన 4.20 ఎకరాల స్థలంలోనే తాము విగ్రహాన్ని నిర్మించామని క్రైస్తవ మత పెద్దలు చెబుతున్నారు.

ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొంత మంది క్రిస్టియ‌న్లు అక్కడ జీసస్ విగ్రహాన్ని, శిలువను నిర్మించారంటూ స్థానిక భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివార్ కార్యకర్తలు ఫిర్యాదు చేయ‌డంతో తాము పోలీసుల సహాయంతో చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని అధికారులు చెబుతున్నారు.