English | Telugu

ఆసియా కప్‌కు భారత్ జట్టు ప్రకటన

దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి జరగనున్న ఆసియా కప్‌కు బీసీసీఐ భారత జట్టు ప్రకటించింది. ముంబైలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో 15 సభ్యులతో స్క్వాడ్‌ను అనౌన్స్ చేసింది. యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఈ జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ కొనసాగగా.. టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కొత్తగా వైస్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు చోటు దక్కలేదు. వికెట్‌కీపర్‌ బ్యాటర్లుగా సంజూ శాంసన్‌, జితేశ్‌ శర్మ చోటు దక్కించుకున్నారు. ప్రసిద్ద్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్‌, ధృవ్‌ జురెల్‌, రియాన్‌ పరాగ్‌, యశస్వి జైస్వాల్‌ స్టాండ్‌ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు.ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.

భారత జట్టు

సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్ పటేల్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌, సంజు శాంసన్‌ (వికెట్‌కీపర్‌), హర్షిత్ రాణా, రింకూ సింగ్