English | Telugu

అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవాలు 

నేటి నుంచి అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దేవస్థానం అధికారులు భక్తులకు అనుమతి నిరాకరించారు. వారం రోజుల పాటు ఆలయంలో కొద్ది మంది సిబ్బందితో కళ్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. రేపు రాత్రి 8 గంటలకు ఆలయంలోని అనివేటి మండపంలో స్వామి వారి కళ్యాణాన్ని యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించే అవకాశాన్ని దేవస్థానం అధికారులు కల్పించారు. రేపు రాత్రి 7 గంటల నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని భక్తులు వీక్షించవచ్చు.