English | Telugu

కువైట్ ప్ర‌క‌టించిన క్షమాబిక్షను ఉప‌యోగించుకోండి! భార‌త రాయ‌బార‌కార్యాల‌య ప్ర‌క‌ట‌న‌

గ‌ల్ఫ్ దేశాల్లో అక్క‌డి నిబంధ‌న‌లను ఉల్లంఘించి అక్ర‌మంగా నివాస‌ముంటున్న వారికి ఆమ్మెస్టీ (క్ష‌మాభిక్ష‌) వ‌రం లాంటిదే. ఎందుకంటే అక్క‌డి రూల్స్ క‌ఠినంగా వుంటాయి. వివిధ కార‌ణాల వ‌ల్ల భార‌తీయులు అక్ర‌మంగా వుండాల్సిన దుస్థితి వుంటుంది. దొరికితే జైలు ఖాయం. అయితే ఆ జైల్లో ఎప్ప‌ట్టి వ‌ర‌కు ఉంటారో తెలియ‌ని ప‌రిస్థితి. అక్ర‌మంగా వుంటున్న వారి వ‌ద్ద క‌నీసం డాక్యుమెంట్లు కూడా వుండ‌వు. పాస్‌పోర్ట్ కూడా య‌జ‌మాని, లేదా ఏజెంట్ తీసుకుని వుంటాడు. అలాంటి వారికి ఈ క్ష‌మాభిక్ష తో స్వ‌దేశానికి వెళ్ళ‌డానికి మార్గం సుగ‌మం అవుతుంది. అందుకే కువైట్‌లో వున్న భార‌త రాయ‌బార కార్యాల‌యం ఆమ్మెస్టీని ఉప‌యోగించుకోమ‌ని అక్క‌డ వున్న అక్ర‌మ వ‌ల‌స‌దారుల్ని విజ్ఞ‌ప్తి చేసింది. కువైట్ ప్రభుత్వం ఇచ్చిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ను ఉపయోగించుకోవలసింది గా భారత రాయ బార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ నెల 16 వ తేది(గురువారం) నుండి 20 వ తేది(సోమవారం) వరకు ఉదయం 08 గంటల నుండి మధ్యాహ్నం 02 గంటల వరకు ఫర్వానియ గవర్నరేట్ లోని ముత్తన్న ప్రైమరీ స్కూల్ ఫర్ బాయ్స్ బ్లాక్ 1 స్ట్రీట్ 122 లో మగ వారు నమోదు చేసుకోవాలి.

మహిళలు ఫర్వానియ గవర్నరేట్ లోని ఫర్వానియ ప్రైమారి స్కూల్ ఫర్ గర్ల్స్ బ్లాక్ 1 స్ట్రీట్ 76 లో నమోదు చేసుకోవాలి.

అలాగే జేలీబ్ అల్ షువైక్ లో నయీం బిన్ మసౌద్ స్కూల్ బాయ్స్ బ్లాక్ 4 స్ట్రీట్ 250 లో మగ వారికి, రుఫిడా అల్-అస్లమియా ప్రైమరీ స్కూల్ బ్లాక్ 4 స్ట్రీట్ 200 లో మహిళలకు కేటాయించారు.

ట్రావెల్ పత్రాలు అంటే పాస్ పోర్ట్ ఉన్నవారందరూ కుడా పైన పేర్కొన్న సెంటర్లకు వెళ్ళాలి. వీరందరూ వారికి సంభందించిన లగేజ్ మొత్తం సర్దుకొని వెంట తీసుకు వెళ్ళవలసి ఉంటుంది. వారి నమోదు పక్రియ కాగానే వారిని షెల్తర్లకు తరలిస్తారు. అక్కడ నుండి నేరు గా వారిని భారత దేశానికి తరలిస్తారు. ఎప్పుడు వారి ప్రయాణం ఉంటుందో ఇరు దేశాల ద్వైపాక్షిక సంభందాల మిధ ఆధార పడి ఉంటుంది.