English | Telugu
నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు
Updated : Jan 17, 2020
నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. ఈ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1, ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది. నిజానికి వీరికి ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష వేయాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ... సాంకేతిక కారణాల వల్ల అది వాయిదా పడింది. నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంతో... వీరికి ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష వేయాలని నిర్ణయించారు.