English | Telugu
డీఎస్సీ-2008 అభ్యర్థులకు తాత్కాలిక ఉద్యోగాలు!
Updated : May 14, 2020
డీఎస్సీ-2008కి సంబంధించిన అభ్యర్థులు మొత్తం 4,657 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరిలో కొందరు ఇప్పటికే వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరికి పదవీ విరమణ వరకు కనీస టైం స్కేల్ ఇస్తూ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం లభించిన తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది.
ఉపాధ్యాయుల బదిలీలకు వివరాల సేకరణ
ఉపాధ్యాయుల బదిలీలకు ఖాళీల వివరాలు పంపాలని కమిషనరేట్ నుంచి జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు అందాయి. ఫిబ్రవరి 29 వరకు ఉన్న ఎస్జీటీ, ఎల్‌ఎఫ్‌ఎల్, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల ఖాళీలు, పాఠశాలల్లో ఖాళీలు, 5, 8 ఏళ్లుగా ఒకేచోట పని చేస్తున్నవారు.. తదితర వివరాలు సేకరిస్తున్నారు.
ఉపాధ్యాయుల ప్రస్తుత సర్వీసు రిజిస్టర్(ఎస్‌ఆర్) స్థానంలో ఈ-ఎస్‌ఆర్ తీసుకొస్తున్నారు. ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరినప్పటి నుంచి పదవీ విరమణ పొందిన వరకు అన్ని సేవలను ఆన్‌లైన్‌లోనే నమోదు చేయనున్నారు. జూన్ నుంచి దీన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మానవవనరుల సేవలు, వేతనాల చెల్లింపులు, సర్వీసు మొత్తం ఆన్‌లైన్ చేయనున్నారు.