English | Telugu

టోల్ గేట్ సిబ్బందిపై ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతి రుబాబు 

ఏపీలో వైసీపీ నాయకులు అటు అధికారులు, ఇటు సామాన్య ప్రజల పై దాడులు చేస్తున్న వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి కాజ టోల్ గేట్ల్ వద్ద రుబాబు చేశారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్తున్న రేవతి కారుకు టోల్‌గేట్ సిబ్బంది బారికేడ్లు అడ్డుపెట్టారు. టోల్ చెల్లించి ముందుకెళ్లాలని సిబ్బంది అడగడంతో ఆమె తన కారు దిగి కోపంతో ఊగిపోతూ టోల్ గేట్ వద్ద సిబ్బందిపై దాడి చేశారు. "నన్నే టోల్ చెల్లించమని అడుగుతావా? నేనెవరో తెలుసా? " అంటూ రేవతి బారికేడ్లను త్రోసివేసిన అనంతరం ఆమె విజయవాడ వైపు వెళ్లిపోయారు. రేవతి హడావిడితో టోల్‌గేట్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు.

అయితే ఈ ఘటన పై కాజ టోల్ గేట్ సిబ్బంది ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి పై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ ఘటనకి సంబంధించిన వీడియోను వారు పోలీసులకు అందచేశారు.