ఏప్రిల్ 16 నుంచి రేషన్ పంపిణీ సందర్భంగా తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌లో చర్చించారు. ఒకే దుకాణం పరిధిలో రెండు మూడు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు గుమిగూడకుండా ముందే టోకెన్లు ఇస్తున్నారు. ఎవరు ఏ రోజు రేషన్‌కోసం రావాలో, ఏ కౌంటర్ వద్దకు రావాలో స్లిప్పులో పేర్కొంటున్నారు. ఎవరికి కార్డు లేకపోయినా అర్హతలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పెట్టామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఇలాంటి సమయంలో ఆహారంలేని పరిస్థితి ఉండకూడదు కాబట్టి.. ఎవరు రేషన్ అడిగినా ఇవ్వండి. ఏ మనిషి కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో ప్రకటించిన విధంగా కరోనా సహాయం కింద రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ కూడా రూ.1000లు ఇవ్వండని సి.ఎం. ఆదేశించారు.