English | Telugu
హుండీ సొమ్ముతో ఆలా ఎలా చేస్తారు.. ఏపీ సర్కారును ప్రశ్నించిన బీజేపీ
Updated : Jul 20, 2020
భక్తులు ఎంతో భక్తి తో తమ డబ్బును హుండీల్లో వేస్తారని.. దానితో దేవాలయాల అభివృద్ధి, ధర్మపరిరక్షణ కోరుకుంటారని అన్నారు. అటువంటి దేవాదాయ శాఖ నిధులను ఇతర శాఖలకు ఖర్చు చేయడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ నుండి దేవాదాయశాఖకు ఒక్క పైసా ఇవ్వనప్పుడు, భక్తులు ఇచ్చిన సొమ్ము తీసుకునే హక్కు మీకెక్కడిది అంటూ అయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం హిందూ ఆలయాల విషయంలోనే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోందని, ఇతర మతాలకు చెందిన విషయాల్లో ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఈ సర్కారుకు ఉందా? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.