కరోనా మహమ్మారి సౌదీని వణికిస్తోంది. సౌదీ రాజకుటుంబంలో 150మందికి కరోన పాజిటివ్ వచ్చింది. వీరిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా వుంది. రాజధాని రియాద్ గవర్నర్ సీనియర్ యువరాజు ఐసీయూ లో చికిత్స తీసుకుంటున్నారు. మరో వైపు రాజు సల్మాన్ కూడా జెడ్డాకు సమీపంలోని ఒక దీవిలోని రాజప్రాసాదంలో ఇప్పటికే స్వీయ నిర్బంధంలో వున్నారు. రాజకుమారుడు సల్మాన్, తన కుమారుడు, ఇతర మంత్రులతో కలిసి అదే దీవిలోని మరోచోట ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్(ఎన్‌వైటీ) పత్రిక స్పష్టం చేసింది.
సౌదీ రాజకుటుంబానికి చికిత్స అందించే కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ ఆసుపత్రి అధికారులు 500 పడకలు ఏర్పాటుచేయాల్సిందిగా ప్రభుత్వ అంతర్గత అధికారులు సందేశం పంపారు. దీంతో ఈ విషయం బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. సౌదీలో ఇప్పటివరకు మొత్తం 2932 మందికి కరోనా రాగా 631 మంది వైరస్ నుండి కోలుకున్నారు.