English | Telugu
హైదరాబాద్‌లో 12 కంటైన్మెంట్ క్లస్టర్ లు...
Updated : Apr 10, 2020
ఈ నిబంధనల అమలుకు పూర్తిగా బారికేడింగ్ చేసి, వైరస్ ను ఎక్కడ కక్కడ కట్టడి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. లోపల వున్న వారి సమస్యలను తెలియజేయుటకు ప్రత్యేక నెంబర్ ను కేటాయించ నున్నట్లు తెలిపారు.ఇప్పటివరకు 12 కంటైన్మెంట్స్ ప్రకటించినట్లు తెలిపారు.కంటైన్మెంట్ నిబంధనల అమలును మానిటరింగ్ చేయుటకు ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని జి హెచ్ ఎం సి కమీషనర్ కు సూచించారు.ప్రభుత్వం నిర్దేశించిన చర్యలను అమలు చేయాలని జోనల్, డిప్యూటీ కమీషనర్లు ఆదేశించారు కోవిద్ -19 వ్యాప్తిని అరికట్టుటలో ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కు ప్రజలందరూ పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇదేవిదంగా ఇకముందు కూడ వ్యవహరించాలని కోరారు. ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.