English | Telugu
సింగరేణి కార్మికుడికి కరోనా పాజిటివ్!
Updated : Apr 10, 2020
అయితే కరోనా భూతం ఇప్పుడు సింగరేణిలోనూ కల్లోలం రేపుతోంది. సింగరేణిలో పని చేసే ఓ కార్మికుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో గని కార్మికుల్లో ఆందోళన మొదలైంది. అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు.
భూపాలపల్లి నుంచి సింగరేణిలో పనిచేసే ఓ కార్మికుడు ఇటీవల మర్కజ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అతడి ద్వారా తన కుమార్తెకు కరోనా సోకింది. దీంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే, వైరస్ బాధితుడు ఢిల్లీ ప్రార్థనల నుంచి వచ్చిన తర్వాత కూడా విధులకు హాజరైనట్లుగా చెబుతున్నారు. దీంతో అతడితో కలిసి పనిచేసిన కార్మికులందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.
సింగరేణిలో పని చేసే కార్మికుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో యాజమాన్యం అప్రమత్తమైంది. అతడితో ఎవరెవరు కలిసి పని చేశారు..? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని సింగరేణి యాజమాన్యం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది.