English | Telugu

'పుష్ప‌' సెకండ్ పార్ట్: పోలీసాఫీస‌ర్‌గా విజ‌య్ సేతుప‌తి?


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయ‌కుడిగా న‌టించిన 'పుష్ప - ద రైజ్'.. ఏ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. పాన్ - ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. కాగా, త్వ‌ర‌లోనే 'పుష్ప‌' సెకండ్ పార్ట్ 'పుష్ప - ద రూల్' రాబోతోంది. సెప్టెంబ‌ర్ లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. వ‌చ్చే ఏడాది జ‌నం ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఇదిలా ఉంటే, 'పుష్ప - ద రైజ్'లో పోలీసాఫీస‌ర్ గా ఫ‌హ‌ద్ ఫాజిల్ పోషించిన పాత్ర‌.. 'పుష్ప - ద రూల్'లోనూ కొన‌సాగ‌నుంది. అంతేకాదు.. క‌థానుసారం మ‌రో పోలీసాఫీస‌ర్ కి కూడా స్కోప్ ఉంద‌ట‌. నెగటివ్ షేడ్స్ తో సాగే ఈ పాత్ర‌లో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తిని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే 'పుష్ప - ద రూల్'లో విజ‌య్ సేతుప‌తి ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. 'పుష్ప - ద రూల్'కి విజ‌య్ సేతుప‌తి చేరిక ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి.

కాగా, అల్లు అర్జున్ కి జోడీగా ర‌ష్మికా మంద‌న్న న‌టించ‌నున్న 'పుష్ప - ద రూల్'కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ బాణీలు అందించ‌నున్నాడు.