English | Telugu

తార‌క్, లాల్.. మ‌రోసారి!?

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ మ‌రోమారు జ‌ట్టుక‌ట్ట‌నున్నారా? అవున‌న్న‌దే ఫిల్మ్ న‌గ‌ర్ బ‌జ్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ఆర్ ఆర్ ఆర్` వంటి సంచ‌ల‌న చిత్రం త‌రువాత తార‌క్.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి సినిమాని చేయ‌బోతున్నారు. `ఎన్టీఆర్ 30` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొంద‌నున్న ఈ ప్రాజెక్ట్.. పాన్ - ఇండియా స్థాయిలో ఎంట‌ర్టైన్ చేయ‌నుంది. అద‌య్యేలోపు `కేజీఎఫ్` కెప్టెన్ ప్ర‌శాంత్ నీల్ నిర్దేశ‌క‌త్వంలో `ఎన్టీఆర్ 31`ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నారు `ఆది` స్టార్. కాగా, ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ఓ స్పెష‌ల్ రోల్ లో క‌నిపిస్తార‌ని ఆ మ‌ధ్య జోరుగా ప్ర‌చారం సాగింది. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఇప్పుడా పాత్ర‌లో మోహ‌న్ లాల్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. అదే గ‌నుక నిజ‌మైతే.. `జ‌న‌తా గ్యారేజ్` (2016) అనంత‌రం తార‌క్, లాల్ ఇంకోసారి క‌లిసి న‌టించే సినిమా ఇదే అవుతుంది. త్వ‌ర‌లోనే `ఎన్టీఆర్ 31`లో మోహ‌న్ లాల్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. తార‌క్, మోహ‌న్ లాల్ కాంబో మ‌రోమారు సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.