English | Telugu

బాల‌య్య చిత్రంలో రాజేంద్ర ప్ర‌సాద్!?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కొత్త చిత్రంలో న‌టకిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ సంద‌డి చేయ‌నున్నారా? అవునన్న‌దే ఫిల్మ్ న‌గ‌ర్ టాక్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. వ‌రుస విజ‌యాలతో ముందుకు సాగుతున్న స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి త్వ‌ర‌లో బాల‌య్య కాంబినేష‌న్ లో ఓ మూవీ తీయబోతున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమా.. తండ్రి - కూతురు క‌థ‌తో తెర‌కెక్క‌నుంది. న‌డివ‌య‌స్కుడైన తండ్రిగా బాల‌కృష్ణ క‌నిపించ‌నుండ‌గా.. కూతురి పాత్ర‌లో శ్రీ‌లీల ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో రాజేంద్ర ప్ర‌సాద్ కూడా ఓ ముఖ్య పాత్ర‌లో ఎంట‌ర్టైన్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `స‌రిలేరు నీకెవ్వ‌రు`, `ఎఫ్ 3` - ఇలా అనిల్ వ‌రుస చిత్రాల్లో రాజేంద్ర ప్ర‌సాద్ వినోదాలు పంచారు. మ‌రి.. బాల‌య్య చిత్రంతో ఈ ఇద్ద‌రు డ‌బుల్ హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.

కాగా, ఇదివ‌ర‌కు బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో `బాబాయ్ - అబ్బాయ్`, `భార్యాభ‌ర్త‌ల బంధం`, `క‌త్తుల కొండ‌య్య‌`, `ప‌ట్టాభిషేకం` వంటి సినిమాల్లో రాజేంద్ర ప్ర‌సాద్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.