English | Telugu

`గ్యాంగ్ స్ట‌ర్` స‌బ్జెక్ట్ తో `మాస్ట‌ర్` కాంబో!?

వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న ద‌ర్శ‌కుల్లో లోకేశ్ క‌న‌క‌రాజ్ ఒక‌రు. `మాన‌గ‌రం`, `ఖైదీ`, `మాస్ట‌ర్`, `విక్ర‌మ్`.. ఇలా త‌మిళ‌నాట నాలుగు హిట్స్ తో వార్తల్లో నిలిచారు లోకేశ్. తెలుగులోనూ ఈ సినిమాలు అనువాద రూపంలో అల‌రించాయి.

ఇదిలా ఉంటే, `విక్ర‌మ్` త‌రువాత లోకేశ్ క‌న‌క‌రాజ్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని `మాస్ట‌ర్` స్టార్ విజ‌య్ తో తీయ‌బోతున్నారు. వంశీ పైడిప‌ల్లి కాంబో మూవీని పూర్తి చేశాక ఈ సినిమా చిత్రీక‌ర‌ణలో పాల్గొన‌బోతున్నారు విజ‌య్. `ద‌ళ‌ప‌తి 67` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజ‌య్ కి జ‌త‌గా స్టార్ బ్యూటీ స‌మంత న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వినిపిస్తోంది. అలాగే, వెర్స‌టైల్ స్టార్ ధ‌నుష్ విల‌న్ గా క‌నిపిస్తాడ‌ని చెప్పుకుంటున్నారు. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇదో అవుట్ అండ్ అవుట్ గ్యాంగ్ స్ట‌ర్ స‌బ్జెక్ట్ తో ఎంట‌ర్టైన్ చేయ‌నుంద‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు విజ‌య్ చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా ఇందులో క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.