English | Telugu

చిరంజీవి చిత్రంలో నితిన్!?

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో యూత్ స్టార్ నితిన్ కూడా న‌టించ‌బోతున్నాడా? అవున‌న్న‌దే ఫిల్మ్ న‌గ‌ర్ బ‌జ్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర్` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ చిత్రం `వేదాళ‌మ్` (2015) ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కేర‌ళ‌కుట్టి కీర్తి సురేశ్ న‌టిస్తుండ‌గా.. చిరుకి జంట‌గా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా ఆడిపాడ‌నుంది. కాగా, ఇదే సినిమాలో ఓ స్పెష‌ల్ రోల్ లో యువ క‌థానాయ‌కుడు నితిన్ ఎంట‌ర్టైన్ చేయ‌నున్నాడ‌ట‌. కీర్తికి భ‌ర్త‌గా, చిరుకి బావ‌గా ఈ పాత్ర క‌నిపిస్తుంద‌ని చెప్పుకుంటున్నారు. త్వ‌ర‌లోనే `భోళా శంక‌ర్`లో నితిన్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. ఈ స్పెష‌ల్ రోల్ నితిన్ కి ఎలాంటి గుర్తింపుని తీసుకువ‌స్తుందో చూడాలి. కాగా, మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీత‌మందిస్తున్న `భోళా శంక‌ర్` 2023 సంక్రాంతికి రిలీజ్ కావ‌చ్చ‌ని టాక్.

ఇదిలా ఉంటే, నితిన్ తాజా చిత్రం `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. మ‌రోవైపు.. వక్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్.