English | Telugu

మహేశ్ ‌లాగే తాను ఇంటెలిజెంట్ అంటున్న రామ్‌చరణ్..?

మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు సినీ పరిశ్రమ కాస్త డిఫరెంట్..ఒక జోనర్‌లో సినిమా హిట్ అయితే మిగిలిన వారు కూడా అదే ఫాలో అవుతారు..లవ్ స్టోరీస్ సక్స్‌స్ అయితే లవ్‌స్టోరీస్, ఫ్యాక్షన్ హిట్ అయితే ఫ్యాక్షన్ మూవీస్, హార్రర్‌‌కి కాసులు కురిపిస్తే హార్రర్ సినిమాలు టాలీవుడ్‌ని ముంచెత్తుతాయి..ఇది మనం చాలా సార్లు చూశాం. ఇప్పుడు అచ్చం అలాంటి దారిలోనే వెళుతున్నాడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్.

అసలు మ్యాటరేంటంటే..తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్. మురగదాస్‌-సూపర్‌స్టార్ మహేశ్ కాంభినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతోంది. వంద కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ జేమ్స్ బాండ్ తరహాలో హై లెవల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో తెరెకెక్కుతోందట. అలాగే ఈ సినిమాలో మహేశ్ ఇంటెలిజెంట్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. ఇప్పుడు అదే దారిలో రామ్‌చరణ్ నడవబోతున్నాడు..ఇండియన్ టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకరైన మణిరత్నం దర్శకత్వంలో చరణ్ నటించబోతున్నాడట.

ఈ మూవీలో మహేశ్‌లాగే ఇంటెలిజెంట్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని ఫిలింనగర్ టాక్. ప్రజంట్ సుకుమార్ దర్శకత్వంలో రేపల్లె చేస్తోన్న చెర్రీ ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే మణిరత్నం సినిమాని పట్టాలెక్కించే అవకాశాలున్నాయని మెగా కాంపౌండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ తెలియాలంటే కొద్దికాలం వెయిట్ చేయకతప్పదు.