English | Telugu

బాలయ్యకు కాజల్ ఎన్నిసార్లు "నో" చెప్పిందో తెలుసా..?

కెరీర్ స్టార్ట్ చేసిన వెంటనే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ రావాలని ప్రతి హీరోయిన్‌ కలలు కంటూ ఉంటుంది. అయితే అందరికీ ఆ అదృష్టం వెంటనే రాదు..ఒకరికి త్వరగా ఆ ఛాన్స్ వస్తే..మరికొందరికి హీరోయిన్‌గా కెరీర్‌ ముగుస్తున్నా రాదు. అలాంటి గోల్డెన్ ఛాన్స్ వచ్చి కూడా వదులుకునే హీరోయిన్లు ఉన్నారంటే మీరు నమ్ముతారా..? ఇక్కడ ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే..ఆ ఆఫర్లు మళ్లీ మళ్లీ రావడం వాటిని రిజెక్ట్ చేయడం..ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా..? కలువకళ్ల కాజల్...ఆ స్టార్ కథానాయకుడు నటసింహం నందమూరి బాలకృష్ణ.

సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్‌తో రోమాన్స్ చేసిన హీరోయిన్లను తన సినిమాలకు తీసుకుంటూ ఉంటారు బాలయ్య. అలాగే బృందావనంలో జూనియర్‌తో నటించిన కాజల్‌ని తన నెక్ట్స్ సినిమాకు తీసుకోవాలని భావించాడట నటసింహం. అయితే అప్పుడప్పుడే స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న కాజల్ మరీ పెద్ద హీరోల పక్కన నటిస్తే ఛాన్సులు రావేమోనని ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేసిందట. అలా ఒకసారి కాదు శ్రీరామరాజ్యం, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల విషయంలోనూ కాజల్ ఇలాగే చేసిందట..తాజాగా బాలయ్య 101వ సినిమా కోసం కాజల్‌ని సంప్రదించాడట పూరి. తన దగ్గర డేట్స్ ఖాళీగా లేవంటూ మళ్లీ ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం 2 కోట్ల భారీ పారితోషికాన్ని ముట్టజెబుతామన్నా కాజల్ ఎందుకు "నో" చెప్పిందో మరీ.