English | Telugu
ఎన్టీఆర్ కి అక్కగా సోనాలి బింద్రే!?
Updated : May 10, 2022
`జనతా గ్యారేజ్` (2016) వంటి సంచలన చిత్రం తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - విజనరీ కెప్టెన్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో తారక్ ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వబోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, తారక్ - కొరటాల సెకండ్ జాయింట్ వెంచర్ లో నిన్నటి తరం అందాల తార సోనాలి బింద్రే ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో ఎన్టీఆర్ కి అక్కగా అభినయానికి ఆస్కారమున్న పాత్రలో సోనాలి కనిపించబోతోందట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, గతంలో `మురారి` (2001), `ఇంద్ర` (2002), `ఖడ్గం` (2002), `మన్మథుడు` (2002), `పలనాటి బ్రహ్మనాయుడు` (2003), `శంకర్ దాదా ఎంబీబీఎస్` (2004) వంటి తెలుగు చిత్రాల్లో కథానాయికగా నటించింది సోనాలి. వీటిలో `పలనాటి బ్రహ్మనాయుడు` మినహా మిగిలిన చిత్రాలన్నీ విజయం సాధించాయి.