English | Telugu
ఐదోసారి సంక్రాంతి బరిలో పవన్!?
Updated : May 9, 2022
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు నాలుగు సార్లు సంక్రాంతి సీజన్ లో సందడి చేశారు. గతంలో `సుస్వాగతం` (1998), `బాలు` (2005), `గోపాల గోపాల` (2015), `అజ్ఞాతవాసి` (2018) చిత్రాలతో ముగ్గుల పండక్కి పలకరించిన పవన్.. త్వరలో మరోమారు ఈ సీజన్ లో ఎంటర్టైన్ చేయనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. వెర్సటైల్ కెప్టెన్ క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` పేరుతో పవన్ కళ్యాణ్ ఓ పిరియడ్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. మొఘలాయిల కాలం నాటి వాతావరణంతో తయారవుతున్న ఈ పాన్ - ఇండియా మూవీలో రాబిన్ వుడ్ తరహా పాత్రలో దర్శనమివ్వనున్నారు పవన్. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తిచేసుకుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. 2023 సంక్రాంతి సమయంలో `హరిహర వీరమల్లు`ని రిలీజ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోందట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది. మరి.. ఐదోసారి సంక్రాంతి బరిలో దిగనున్న పవన్.. `హరిహర వీరమల్లు`తో ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తారో చూడాలి.
కాగా, `హరిహర వీరమల్లు`లో పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు.