English | Telugu

శృతి నా మాట విను..లేదంటే కెరీర్ నాశనమే..?

కమల్ హాసన్ కూతురిగా వెండితెరకు పరిచయమైనా మొదట్లో నటిగా గుర్తింపు పొందడానికి చాలా కష్టాపడాల్సి వచ్చింది శృతీహాసన్...చేసిన ప్రతి సినిమా అట్టర్ ఫ్లాప్‌కావడంతో సౌత్‌లో ఐరన్ లెగ్‌గా ముద్రపడింది..దీంతో శృతికి ఆఫర్ ఇవ్వడానికి ఏ ఒక్కరూ ధైర్యం చేయలేదు. ఇలాంటి టైమ్‌లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ పక్కన చేసిన గబ్బర్ సింగ్‌తో ఆమె సుడి తిరిగింది. అప్పటి నుంచి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఫుల్ బిజీ అయ్యింది. అలాగే పవన్ అంటే మంచి అభిమానం ఏర్పడింది..ఇప్పుడు ఇద్దరూ కలిసి కాటమరాయుడు చేస్తుండటంతో ఆ స్నేహం మరింత బిగుసుకుపోయింది.

సాధారణంగా స్నేహానికి ప్రాణమిచ్చే పవన్...తన మిత్రులకు ఎలాంటి కష్టమొచ్చినా సాయం చేయడానికి ముందుంటారు. అలాగే మంచి విషయాలను వారికి చెబుతూ ఉంటారు. ఆ చనువుతోనే శృతికి కూడా పెద్ద క్లాస్ తీసుకున్నాడట. మాటల సందర్భంలో తాను సౌత్‌పై ఫోకస్ తగ్గించి బాలీవుడ్‌ మూవీస్ చేస్తానని పవన్‌తో చెప్పిందట శృతి. అయితే ఆమెను మరోసారి ఆలోచించుకోవాలని చెప్పాడట పవర్‌స్టార్.. బాలీవుడ్‌లో కంటే సౌత్‌లో హీరోయిన్‌గా ఎక్కువకాలం కెరీర్ కొనసాగించవచ్చని..బీ-టౌన్‌లో ఉండే కాంపిటేషన్ తట్టుకోలేవని చెప్పాడట. మరి పవన్ చెప్పిన మాటని శృతి వింటుందా లేక మిగిలిన హీరోయిన్లలాగే కెరీర్ నాశనం చేసుకుంటుందా అనేది వేచి చూడాలి.