English | Telugu

సూర్య‌కి జోడీగా పూజా హెగ్డే!?

ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా.. తెలుగునాట అగ్ర క‌థానాయిక‌గా దూసుకుపోతోంది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ త‌న గ్లామ‌ర్ తో క‌నువిందు చేస్తున్న పూజ‌.. తాజాగా ఓ క్రేజీ కోలీవుడ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని స‌మాచారం.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `శౌర్యం` శివ ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా ఓ విలేజ్ డ్రామా తెర‌కెక్క‌నుంది. యాక్ష‌న్ - సెంటిమెంట్ అంశాల మేళ‌వింపుగా రూపొంద‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో సూర్య‌కి జోడీగా పూజా హెగ్డేని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. క‌థ‌, పాత్ర‌, పారితోషికం న‌చ్చ‌డంతో పూజ కూడా ఈ సినిమా చేసేందుకు ఆస‌క్తి చూపిస్తోంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే సూర్య - శివ కాంబో మూవీలో పూజ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. `ముగ‌మూడి`, `బీస్ట్` చిత్రాల‌తో త‌మిళ‌నాట ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకున్న పూజ‌.. సూర్య సినిమాతోనైనా స‌క్సెస్ బాట ప‌డుతుందేమో చూడాలి.

కాగా, ప్ర‌స్తుతం పూజ చేతిలో `స‌ర్క‌స్`, `క‌భీ ఈద్ క‌భీ దివాళి` వంటి హిందీ చిత్రాల‌తో పాటు `జ‌న గ‌ణ మ‌న‌`, `#SSMB 28` వంటి తెలుగు సినిమాలున్నాయి.