English | Telugu

య‌శ్ తో పూజా హెగ్డే రొమాన్స్!?

ప్ర‌స్తుతం చేతినిండా సినిమాలున్న అగ్ర క‌థానాయిక‌ల్లో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఒక‌రు. హిందీనాట‌ `స‌ర్క‌స్`, `క‌భీ ఈద్ క‌భీ దివాళి` చిత్రాల్లో యాక్ట్ చేస్తున్న మిస్ హెగ్డే.. యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌స్తున్న సెకండ్ పాన్ - ఇండియా మూవీ `జ‌న గ‌ణ మ‌న‌`లోనూ హీరోయిన్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. అంతేకాదు.. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబోలో రానున్న `#SSMB 28`లోనూ త‌నే లీడింగ్ లేడీ.

ఇదిలా ఉంటే, తాజాగా పూజ ఖాతాలో మ‌రో బిగ్ టికెట్ ఫిల్మ్ చేరింద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `కేజీఎఫ్` సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శాండిల్ వుడ్ స్టార్ య‌శ్.. `మ‌ఫ్తి` ఫేమ్ న‌ర్త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నారట‌. కాగా, భారీ బ‌డ్జెట్ తో పాన్ - ఇండియా మూవీ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో పూజా హెగ్డేని నాయిక‌గా న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మ‌రి.. క‌న్న‌డంలో తొలిసారిగా న‌టించ‌నున్న పూజ‌కి.. య‌శ్ కాంబినేష‌న్ ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి.