English | Telugu

శ‌ర్వానంద్ చిత్రంలో ప్రియ‌మ‌ణి!?

పెళ్ళ‌య్యాక కూడా న‌టిగా త‌న‌దైన ముద్ర వేస్తోంది నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్ర‌స్ ప్రియ‌మ‌ణి. ఆ మ‌ధ్య విక్రరీ వెంక‌టేశ్ `నార‌ప్ప‌`లో సుంద‌ర‌మ్మ‌గా అల‌రించిన ప్రియ‌మ‌ణి.. ఈ నెల 17న విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ రానా ద‌గ్గుబాటి `విరాట ప‌ర్వం`లో కామ్రేడ్ భార‌త‌క్క‌గా ప‌ల‌క‌రించ‌బోతోంది.

ఇదిలా ఉంటే, తాజాగా ప్రియ‌మ‌ణి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `రౌడీ ఫెలో`, `ఛ‌ల్ మోహ‌న్ రంగ‌` చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య‌.. త‌న త‌దుప‌రి సినిమాని యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ తో తీయ‌బోతున్నాడు. ఆగ‌స్టు నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో శ‌ర్వానంద్ కి జోడీగా స్ట‌న్నింగ్ బ్యూటీ రాశీ ఖ‌న్నా న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం. గోదావ‌రి యాస‌లో రాశి సంద‌డి చేయ‌నుంద‌ని టాక్. కాగా, ఇదే సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం ప్రియ‌మ‌ణి క‌నిపించ‌నుంద‌ని బ‌జ్. అంతేకాదు.. క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర ఇద‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే శ‌ర్వానంద్ - కృష్ణ చైత‌న్య కాంబో మూవీలో ప్రియ‌మ‌ణి ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది. మ‌రి.. ఈ చిత్రంతో ప్రియ‌మ‌ణి న‌టిగా ఎలాంటి గుర్తింపుని పొందుతుందో చూడాలి.