English | Telugu

ద‌స‌రా నుంచి `ఎన్టీఆర్ 31`!?

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ రీసెంట్ గా `ఆర్ ఆర్ ఆర్`తో ఎంట‌ర్టైన్ చేశారు. త్వ‌ర‌లో ఈ టాలెంటెడ్ స్టార్.. విజ‌న‌రీ కెప్టెన్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో కొత్త సినిమాని ప్రారంభించ‌నున్నారు. `ఎన్టీఆర్ 30` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొంద‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ జూన్ నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. 2023 ఆరంభంలో ఈ సినిమా జ‌నం ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఇదిలా ఉంటే, `కేజీఎఫ్` ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లోనూ తార‌క్ ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ వెంచ‌ర్ కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. ఈ ఏడాది ద‌సరాకి ఈ సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ట‌. అలాగే, న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ బాట ప‌ట్టే `ఎన్టీఆర్ 31`.. 2024 విజ‌య‌ద‌శ‌మికి తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముందంటున్నారు. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

కాగా, ప్రశాంత్ నీల్ ప్ర‌స్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో `స‌లార్` తీస్తున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ బ‌డా ప్రాజెక్ట్.. 2023లో రిలీజ్ కానుంది.