English | Telugu
చైతూ `థాంక్ యూ`కి రిలీజ్ డేట్ ఫిక్సయిందా!?
Updated : May 7, 2022
`మజిలీ`, `వెంకిమామ`, `లవ్ స్టోరి`, `బంగార్రాజు` చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. త్వరలో ఈ అక్కినేని వారి యంగ్ హీరో.. `థాంక్ యూ`తో సందడి చేయనున్నాడు. `జోష్` (2009) తరువాత స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మాణంలోనూ.. `మనం` (2014) అనంతరం వెర్సటైల్ కెప్టెన్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లోనూ చైతూ ఈ సినిమా చేస్తున్నాడు. రాశీ ఖన్నా మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అవికా గోర్, మాళవికా నాయర్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రానికి ఏస్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. దాదాపుగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న `థాంక్ యూ`కి తాజాగా రిలీజ్ డేట్ లాక్ అయిందట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. జూలై 7న `థాంక్ యూ`ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే `థాంక్ యూ` రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. మరి.. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న చైతూ `థాంక్ యూ`తోనూ ఆ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి. కాగా, ఆగస్టు 11న ఆమిర్ ఖాన్ తో కలిసి చైతూ నటించిన హిందీ చిత్రం `లాల్ సింగ్ ఛద్దా` తెరపైకి రానుంది.