Read more!

English | Telugu

ఫ్యామిలీ ప్యాక్ హీరోగా నారా రోహిత్

 

"బాణం" చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన నటుడు నారా రోహిత్ పై రోజు రోజుకు టాలీవుడ్ లో సెటైర్లు ఎక్కువ అవుతున్నాయి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా కూడా హీరో అంటే అందంగా, మంచి బాడీ కలిగి ఉంటే సరిపోతుంది. ఫిజిక్ పరంగా ఎప్పడు ఫిట్ గా ఉండేలా చూసుకోవాలి. కానీ రోహిత్ మాత్రం స్లిమ్ గా ఉండకుండా రోజు రోజుకి డ్రమ్ములాగా మారుతున్నాడు.

ఈ విషయంపై ఇప్పటికే నారా రోహిత్ కి చాలా మంది నేరుగా చెప్పినప్పటికీ కూడా... ఎవరి మాట లెక్కచేయకుండా తన ఫ్యామిలీ ప్యాక్ ను అలాగే మెయింటేన్ చేస్తున్నాడు. ఒకప్పుడు సునీల్ కూడా ఫ్యామిలీ ప్యాక్ తో ఉండేవాడు. కానీ హీరో అవ్వాలంటే కృషి, పట్టుదల మాత్రమే కాదు బాడీ మెయింటనెన్స్ కూడా ముఖ్యమనుకొని, తన బాడీని సిక్స్ ప్యాక్ లోకి తెచ్చుకున్నాడు. ఇపుడు హీరోగా మంచి స్థానంలో ఉన్నాడు. కానీ నారా రోహిత్ పరిస్థితి చూస్తే సునీల్ వదిలేసిన ఆ ఫ్యామిలీ ప్యాక్ ను తను కంటిన్యు చేస్తూ, సునీల్ లాగా కమెడియన్ గా మరిపోతాడేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మరి ఇప్పటికైనా తన బాడీ ఫిట్ నెస్ పై కూడా శ్రద్ధ పెట్టి, సరైన సినిమాలను ఎంచుకుంటే నారా రోహిత్ కూడా టాప్ 10 హీరోల్లో ఒకడిగా స్థానం సంపాదించుకోవచ్చు. ఇప్పటి వరకు రోహిత్ నటించిన దాదాపు అన్ని చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కానీ తను స్లిమ్ గా మరి సినిమాలు తీస్తే ఇక రచ్చ రచ్చే. మరి ఇక నుంచైనా నారా రోహిత్ మారుతాడో లేదో చూడాలి.