English | Telugu

పవన్‌కు దగ్గరైతే..మెగా ఫ్యామిలీకి దూరమైనట్లేనా..?

పేరుకు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పైకి ఎంతగా కవరింగ్ ఇస్తున్నప్పటికి మెగా హీరోల ఇగోలు బయటకు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అంటే చాలు అంతేత్తున లేస్తున్నారట. ఇంట్లో పవన్ పేరు కాని..టీవీల్లో ఆయన పాట వచ్చినా జీర్ణించుకోలేకపోతున్నారట..ఇదంతా పక్కనబెడితే పవన్‌కు మద్ధతిచ్చే వారిని కూడా దూరం పెడుతున్నారట. ఇప్పుడు ఈ లిస్ట్‌లో చేరిపోయారు మెగా మేనల్లుడు సాయిథరమ్ తేజ్.. ఇందుకు అనేక కారణాలున్నాయి. ముగ్గురు మావయ్యల్లో చినమావయ్య పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టమని..ఆయనకు నేనంటే స్పెషల్ కేరింగ్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు తేజూ.

ఆ తర్వాత ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో పవన్ పోరాటానికి తన మద్ధతు ఉంటుందని బాహాటంగానే ప్రకటించాడు సాయి..ఇప్పుడు ఏకంగా పవన్ సొంత బ్యానర్‌లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సాయితో అంటిముట్టనట్టు ప్రవర్తిస్తోందట మెగా కాంపౌండ్. ముఖ్యంగా అల్లు ఫ్యామిలీ సాయిని బాగా టార్గెట్ చేసిందట..అందుకే రీసెంట్‌గా జరిగిన విన్నర్ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. దీన్ని బట్టి పవన్‌కు మిత్రులైన ప్రతీ ఒక్కరూ తమకు శత్రువే అన్నట్లు మెగా, అల్లు కుటుంబాలు చెప్పకనే చెబుతున్నాయని టాలీవుడ్ టాక్.