English | Telugu

ఆస్ట్రేలియా బిజినెస్‌మేన్‌తో పెళ్లి ఫిక్స్‌ చేసుకున్న త్రిష? 

1999లో ‘జోడి’ చిత్రంలో ఓ చిన్న క్యారెక్టర్‌ చేయడం ద్వారా తన కెరీర్‌ ప్రారంభించిన త్రిష.. ఆ తర్వాత తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పలు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి క్రేజీగా హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. రెండున్నర దశాబ్దాలుగా హీరోయిన్‌గా నటిస్తూ ఇప్పటికీ కెరీర్‌ కొనసాగిస్తున్న త్రిష.. పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. 2015లో బిజినెస్‌మేన్‌ వరుణ్‌ మణియన్‌తో త్రిష ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరి అంగీకారంతో దాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి ఊసు ఎత్తలేదు. చాలా సందర్భాల్లో పెళ్లి ప్రస్తావన తెచ్చినపుడు తన మనసుకు దగ్గరగా ఉన్న వ్యక్తి తారసపడితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్తూ వచ్చింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు త్రిష తల్లిదండ్రులు ఓ సంబంధం చూశారని, దానికి త్రిష కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఛండీఘడ్‌కు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియాలో బిజినెస్‌మేన్‌గా స్థిరపడ్డాడు. అతనితో త్రిష వివాహం చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారని సమాచారం. కోలీవుడ్‌లో త్రిష పెళ్ళి గురించి బాగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై త్రిష ఇప్పటివరకు స్పందించలేదు. ఇక ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవితో ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తోంది. తమిళ్‌లో సూర్య హీరోగా రూపొందుతున్న ‘కరుప్పు’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.