English | Telugu

ఎన్టీఆర్, బాలకృష్ణ కాదు.. కొరటాల నెక్స్ట్ హీరో ఎవరంటే..?

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ నెక్స్ట్ మూవీ ఏంటనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తో దేవర పార్ట్-2 చేయాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం ఎన్టీఆర్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో.. 'దేవర-2' సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతోంది. దీంతో ఈ గ్యాప్ లో మరో సినిమా చేసే ప్రయత్నాల్లో కొరటాల ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నాగచైతన్య, బాలకృష్ణ వంటి హీరోల పేర్లు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా వెంకటేష్ పేరు తెరపైకి వచ్చింది. (Koratala Siva)

ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నారు వెంకటేష్. ప్రస్తుతం చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'మన శంకర వరప్రసాద్ గారు'లో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. అలాగే, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత కొరటాల డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ కోసం కొరటాల ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేశాడట. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.

కాగా, బాలకృష్ణ కోసం కూడా ఓ పొలిటికల్ జానర్ స్క్రిప్ట్ ను కొరటాల రెడీ చేసినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఇప్పటికే బాలయ్య చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి కావడానికి చాలా టైం పడుతుంది. అందుకే, కొరటాల ఇప్పుడు వెంకటేష్ తో సినిమా చేసే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. మరి దీని తర్వాత 'దేవర-2', ఆ తర్వాత బాలయ్య ప్రాజెక్ట్ ఉంటాయేమో చూడాలి.