English | Telugu

అప్పుడు నాని.. ఇప్పుడు రామ్!

'కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథ‌'(2016)లో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానిగా ఎంట‌ర్టైన్ చేయ‌డ‌మే కాకుండా ఓ మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. క‌ట్ చేస్తే.. నాని త‌ర‌హాలోనే మ‌రో యంగ్ హీరో కూడా త్వ‌ర‌లో బాల‌కృష్ణ ఫ్యాన్ గా సంద‌డి చేయ‌నున్నాడ‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం `ద వారియ‌ర్` అనే కాప్ డ్రామా చేస్తున్న‌ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. త్వ‌ర‌లో మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్టైనర్ ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ - ఇండియా మూవీగా రూపొంద‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాల‌య్య అభిమానిగా క‌నిపిస్తాడ‌ట రామ్. అంతేకాదు.. ఓ ఎపిసోడ్ లో అయితే `జై బాల‌య్య‌` నినాదాల‌తో రామ్ భ‌లేగా సంద‌డి చేస్తాడ‌ని చెప్పుకుంటున్నారు. స్వ‌తహాగా బాల‌య్య అభిమాని కావ‌డ‌మే కాకుండా త‌న కాంబినేష‌న్ లో `సింహా`, `లెజెండ్`, `అఖండ‌` వంటి హ్యాట్రిక్ విజ‌యాలు అందుకున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను.. ఈ ఎపిసోడ్ ని నెక్స్ట్ లెవ‌ల్ లో డిజైన్ చేశాడ‌ని టాక్. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మ‌రి.. నాని లాగే రామ్ కూడా బాల‌య్య అభిమానిగా అల‌రించి మెమ‌ర‌బుల్ హిట్ ని క్రెడిట్ చేసుకుంటాడేమో చూడాలి.