English | Telugu

విజ‌య్ ని ఢీ కొట్ట‌నున్న ధ‌నుష్!?

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ కి మ‌రో టాప్ స్టార్ ధ‌నుష్ ప్ర‌తినాయ‌కుడు కానున్నారా? అవున‌న్న‌దే కోలీవుడ్ టాక్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `మాస్ట‌ర్` (2021) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత విజ‌య్ క‌థానాయ‌కుడిగా లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ కి జోడీగా స్టార్ బ్యూటీ స‌మంత న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో విల‌న్ గా ధ‌నుష్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ట‌. ఇప్ప‌టికే ఈ మేర‌కు ధ‌నుష్, లోకేశ్ మ‌ధ్య చ‌ర్చ‌లు న‌డిచాయ‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. అదే గ‌నుక నిజ‌మైతే.. విజ‌య్, ధ‌నుష్ క‌లిసి న‌టించే తొలి చిత్ర‌మిదే అవుతుంది. మ‌రి.. విజ‌య్, ధ‌నుష్ ఆన్ స్క్రీన్ వార్.. బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే, విజ‌య్ ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ బైలింగ్వ‌ల్ మూవీ చేస్తున్నారు. అగ్ర నిర్మాత `దిల్` రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2023 పొంగ‌ల్ కి ఎంట‌ర్టైన్ చేయ‌నుంది. ఇక ధ‌నుష్ విష‌యానికి వ‌స్తే.. `ద గ్రే మ్యాన్` (ఇంగ్లిష్ - స్పెష‌ల్ రోల్), `తిరుచిత్రాంబ‌లం`, `నానే వ‌రువేన్` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న‌ బైలింగ్వ‌ల్ మూవీ `సార్` (త‌మిళంలో `వాత్తి`) చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.