English | Telugu

బాల‌య్య‌తో మ‌రోసారి జ‌గ్గూభాయ్!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన `లెజెండ్` (2014)లో ప్ర‌తినాయ‌కుడిగానూ.. `అఖండ‌` (2021)లో ప్ర‌త్యేక పాత్ర‌లోనూ ఆక‌ట్టుకున్నారు వెర్స‌టైల్ స్టార్ జ‌గ‌ప‌తి బాబు. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో బాల‌య్య‌తో మ‌రోమారు జ‌ట్టుక‌ట్ట‌నున్నార‌ట జ‌గ్గూభాయ్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ప‌టాస్` (2015) నుంచి `ఎఫ్ 3'(2022) వ‌ర‌కు వ‌రుస‌గా ఆరు విజ‌యాల‌తో వార్త‌ల్లో నిలిచిన స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి త‌న త‌దుప‌రి చిత్రాన్ని బాలకృష్ణ కాంబినేష‌న్ లో చేయ‌బోతున్న విష‌యం విదిత‌మే. సెప్టెంబ‌ర్ నుంచి ప‌ట్టాలెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో న‌డివ‌య‌స్కుడైన తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు బాల‌య్య‌. కాగా, ఇదే సినిమాలో ఓ స్పెష‌ల్ రోల్ లో జ‌గ‌ప‌తి బాబు ఎంట‌ర్టైన్ చేయ‌నున్నార‌ని వినిపిస్తోంది. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే, జ‌గ‌ప‌తి బాబు ప్ర‌స్తుతం `స‌లార్`, `కబ్జా` (క‌న్న‌డ‌), `క‌బీ ఈద్ క‌బీ దివాళి` (హిందీ) వంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ లో న‌టిస్తున్నారు. ఈ మూడు సినిమాల్లోనూ ఒక‌దానితో ఒక‌టి పొంత‌న లేని విభిన్న పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు జ‌గ్గూభాయ్.