English | Telugu

బాల‌య్య + పూరి = 18 కోట్లు

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణితో ఓ మ‌ర‌పురాని విజ‌యాన్ని అందుకొన్నాడు మ‌న బాలయ్య బాబు. ఈసినిమా ఏకంగా రూ.77 కోట్లు సాధించి.. బాల‌య్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్ అందుకొంది. ఇప్పుడు బాల‌య్య త‌న 101వ సినిమాతో బిజీగా ఉన్నాడు. వ‌రుస విజ‌యాల‌తో ఫామ్‌లో ఉన్న బాల‌కృష్ణ ఈ సినిమా కోసం ఎంత పారితోషికం తీసుకొంటున్నాడో తెలుసా?? అక్ష‌రాలా రూ.10 కోట్లు. లెజెండ్ త‌ర‌వాతే బాల‌య్య రేంజ్ పెరిగింది.

అయితే గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ఱి కోసం మాత్రం బాల‌య్య రూ.8 కోట్లే తీసుకొన్నాడ‌ట‌. ఆ సినిమా చారిత్ర‌క నేప‌థ్యంలో తెర‌కెక్క‌డం, బ‌డ్జెట్ భారీగా అవ్వ‌డంతో బాల‌య్య తన పారితోషికంలో రిబేటు ఇచ్చాడ‌ని, అయితే పూరి సినిమాకి మాత్రం బాల‌య్య త‌న పారితోషికం ఏమాత్రం త‌గ్గించ‌లేద‌ని, సింగిల్ పేమెంట్ గా రూ.10 కోట్లు అందుకొన్నాడ‌ని తెలుస్తోంది. అంతేకాదు.. పూరికి ఈ సినిమా కోసం అక్ష‌రాలా రూ.8 కోట్ల పారితోషికం అందింద‌ట‌. హీరో, ద‌ర్శ‌కుడి పారితోషికాల‌కే రూ.18 కోట్లంటే.. మ‌రి సినిమాకి ఎంత పెడ‌తారో??