English | Telugu

సాయికుమార్ రియల్ స్టోరీతో బొమ్మరిల్లు-2 

Publish Date:Jan 6, 2026

  టాలీవుడ్ లో రూపొందిన ఎవర్ గ్రీన్ రొమాంటిక్ కామెడీ ఫిలిమ్స్ లో 'బొమ్మరిల్లు' ఒకటి. సిద్దార్థ్, జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ 2006 ఆగస్టులో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ ఆగస్టుతో 'బొమ్మరిల్లు' సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ తరుణంలో బొమ్మరిల్లు సీక్వెల్ గురించి నిర్మాత దిల్ రాజు(Dil Raju) మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.   ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'శంబాల' మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలై విజయం సాధించింది. తాజాగా నిర్వహించిన ఈ మూవీ థాంక్యూ మీట్ కి దిల్ రాజు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయికుమార్ రియల్ స్టోరీతో బొమ్మరిల్లు-2 తీయొచ్చని అన్నారు. (Shambhala Thank You Meet)   Also Read: హీరో విజయ్ కి సీబీఐ నోటీసులు!   "20 ఏళ్ళ క్రితం మేము తీసిన బొమ్మరిల్లు సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. బొమ్మరిల్లు ఫాదర్ పాత్ర ఎన్నో ఫ్యామిలీస్ లో చేంజెస్ తీసుకొచ్చింది. ఒకవేళ బొమ్మరిల్లు-2 తీయాల్సి వస్తే.. సాయికుమార్ గారు, ఆది స్టోరీ పెట్టి తీయాలి. కొడుకు సక్సెస్ గురించి తండ్రి పడే తపన మామూలుది కాదు. ఆదికి ఒక్కడికే కాదు.. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ బ్యాక్ బోన్ లా సాయికుమార్ గారు నిలిచారు." అని దిల్ రాజు అన్నారు.   మరి సాయికుమార్ రియల్ స్టోరీతో బొమ్మరిల్లు-2 తీయొచ్చని చెప్పిన దిల్ రాజు.. దానిని నిజం చేసే దిశగా అడుగులు ఏమైనా వేస్తారేమో చూడాలి.    

Anil Ravipudi reimagined Megastar Chiru style for MSG

Publish Date:Jan 6, 2026

As the countdown to the January 12th release begins, producers Sahu Garapati and Sushmita Konidela have shared fascinating insights into the creative process behind Mana Shankara Vara Prasad Garu. The film is being hailed as a tribute to the legendary screen presence of Megastar Chiranjeevi, crafted through the unique lens of director Anil Ravipudi. Sushmita Konidela shared that the film feels like "opening a new talent box" for her father. While it pays homage to his vintage charm, his performance remains incredibly fresh. She noted that Chiranjeevi approached the role with the dedication of a newcomer, focusing intensely on his fitness and character preparation.  Director Anil Ravipudi’s vision was to bring back the "vintage Megastar" that fans have long craved, ensuring every scene leaves a smile on the audience's face. The addition of Victory Venkatesh into this mix has created a powerhouse of entertainment. The producers highlighted that Venkatesh’s character provides a "rich and impactful" presence that significantly raises the film's energy.  With music by Bheems Ceciroleo and stunning visuals by Sameer Reddy, the producers are confident that this collaboration between a veteran legend and a blockbuster director will deliver the perfect emotional and comedic balance for families this Sankranthi. Nayanthara is playing the leading lady role in this film.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

ఆరోజుల్లోనే అరుదైన రికార్డును క్రియేట్‌ చేసిన బి.సరోజాదేవి!

Publish Date:Jan 6, 2026

(జనవరి 7 బి.సరోజాదేవి జయంతి సందర్భంగా..) హీరోయిన్‌ అంటే అందం, అభినయం ఉండాలి. చక్కని నాట్యం ప్రదర్శించాలి. ఇవన్నీ ఉంటేనే నటిగా రాణించగలుగుతారు. ఈ లక్షణాలన్నీ ఉన్న హీరోయిన్‌గా ఆరోజుల్లో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు బి.సరోజాదేవి. తండ్రి బైరప్ప ఒక పోలీస్‌ ఉన్నతాధికారి. ఆయనకు కళలపట్ల ఎంతో మక్కువ. అందుకే కుమార్తె సరోజాదేవికి చిన్నప్పటి నుంచే నాట్యం నేర్పించారు. ఆమెను మంచి నటిగా చూడాలన్నది తండ్రి కోరిక. కానీ, సరోజాదేవికి సినిమా నటి అవ్వాలన్న ఆలోచన లేదు. పెద్దయ్యాక టీచర్‌ అవ్వాలని కలలు కనేది.    తల్లిదండ్రుల బలవంతం మీద కన్నడలో నిర్మించిన మహాకవి కాళదాస చిత్రంలో తొలిసారి నటించారు సరోజాదేవి. ఆ తర్వాత మరో రెండు, మూడు సినిమాలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చేశారు. అలా ఆమెకు నటనపై ఆసక్తి కలిగింది. సినిమా నటిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. మొదట కన్నడ, ఆ తర్వాత తమిళ సినిమాల్లో నటించిన సరోజాదేవి.. తెలుగులో నటించిన మొదటి సినిమా పెళ్లిసందడి. అయితే ఎన్టీఆర్‌ నిర్మించిన పాండురంగమహత్మ్యం ముందుగా రిలీజ్‌ అయింది.   తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో ఆమె హీరోయిన్‌గా బిజీ అయిపోయారు. 1950 దశకంలో అన్ని భాషల్లో హీరోయిన్‌గా నటించిన ఘనత ఆమెకే దక్కింది. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఆమె ముద్దు ముద్దు మాటలు ప్రేక్షకులు బాగా ఇష్టపడేవారు. ఆరోజుల్లో కొందరు అమ్మాయిలు సరోజాదేవిని అనుకరిస్తూ మాట్లాడేవారు. అంతేకాదు, ఆమె ధరించే చీరలు, బ్లౌజులు, జ్యూయలరీ.. వంటి విషయాలను అప్పటి అమ్మాయిలు అనుకరించేవారు.    తమిళ్‌లో ఎం.జి.ఆర్‌.తో 26 సినిమాల్లో, శివాజీ గణేశన్‌తో 22 సినిమాల్లో నటించారు. కన్నడలో రాజ్‌కుమార్‌, ఉదయ్‌కుమార్‌, కళ్యాణ్‌కుమార్‌లతో, హిందీలో దిలీప్‌కుమార్‌, షమ్మీ కపూర్‌, సునీల్‌దత్‌, రాజేంద్రకుమార్‌ వంటి టాప్‌ హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు సరోజాదేవి. ఆరోజుల్లో ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకున్న దక్షిణాది హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమెను ఆంధ్రా క్లియోపాత్రాగా, ఆంధ్రా ఎలిజిబెత్‌ టేలర్‌గా పిలిచేవారు. పదేళ్ళపాటు నాలుగు భాషల్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన సరోజాదేవి తన కెరీర్‌లో మొత్తం 200 సినిమాల్లో నటించారు. వాటిలో హీరోయిన్‌గా నటించిన సినిమాలు 161. ఇంత పెద్ద సంఖ్యలో హీరోయిన్‌గా నటించిన వారు ఆరోజుల్లో ఎవరూ లేరు. అలా అన్ని విషయాల్లోనూ ఏ హీరోయిన్‌ కూడా సాధించని రికార్డులను బి.సరోజాదేవి సాధించారు.    తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నటించి అప్పట్లోనే పాన్‌ ఇండియా హీరోయిన్‌ అనిపించుకున్నారు బి.సరోజాదేవి. వ్యకిగత విషయాలకు వస్తే.. 1967 మార్చి 1న వ్యాపార వేత్త శ్రీహర్షతో బి.సరోజాదేవి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. భువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, గౌతమ్‌ రామచంద్ర. 1986లో భర్త శ్రీహర్ష గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత 1997లో పెద్ద కుమార్తె భువనేశ్వరి కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు.    సరోజాదేవి అందుకున్న పురస్కారాల గురించి చెప్పాలంటే.. సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను 1969లో పద్మశ్రీతోనూ, 1992లో పద్మభూషణ్‌తోనూ సరోజాదేవిని సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఇవికాక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక అవార్డులు ఆమెను వరించాయి. బెంగళూరు యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్‌నిచ్చి గౌరవించింది. కొంతకాలం ఆరోగ్య సమస్యలతో బాధపడిన బి.సరోజాదేవి.. 2025 జూలై 14న తుదిశ్వాస విడిచారు.   

విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్.. ముగ్గురు పిల్లల విషయంలో కీలక నిర్ణయం 

Publish Date:Jan 5, 2026

        -భారతీయ మీడియా వర్గాల్లో మరో సంచలనం  -16 ఏళ్ళ వివాహ బంధానికి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఏంటి -సోషల్ మీడియా వేదికగా  మహి విజ్ చేసిన పోస్ట్ ఏంటి -మరి ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటి!       ఈ మధ్య కాలంలో భార్యా, భర్తలైన సినీ, టీవీ సెలబ్రటీలు పోటాపోటీగా విడాకులు తీసుకుంటున్నారు. కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టినా వాళ్లే కాకుండా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వాళ్ళు సైతం విడాకులు ప్రకటిస్తు ఉండటం అభిమానులని కలవర పరుస్తు ఉంది. రీసెంట్ గా మరో  సెలబ్రటీ కపుల్ డైవర్స్ తో తమ పదహారు సంవత్సరాల వివాహ బంధానికి సెండ్ ఆఫ్ చెప్పి అభిమానులకి కలవర పాటుకి గురి చేసింది.   మహి విజ్, జై భానుషాలి.. బాలీవుడ్ సినీ,టీవీ రంగంలో సుదీర్ఘ కాలం నుంచి తిరుగులేని ఆది పత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నారు. 2011 లో ఈ ఇద్దరి వివాహం జరగగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ గా మహి విజ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా విడాకులపై స్పందిస్తు 'ఇద్దరం విడిపోయినా  కూడా పిల్లలు తారా, ఖుషి, రాజ్‌వీర్‌ల కోసం మంచి తల్లిదండ్రులుగా, మంచి స్నేహితులుగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మేము వేరు దారుల్లో నడుస్తున్నా విడాకుల  నిర్ణయం వెనుక ఎలాంటి నెగిటివిటీ,డ్రామా లేదు. కేవలం ప్రశాంతత కోసమే విడాకుల నిర్ణయాన్ని ఎంచుకున్నాం..స్నేహబంధం కొనసాగుతూనే  ఒకరిని ఒకరం గౌరవించుకునే విషయంలో రాజీ పడం. ఈ సమయంలో అభిమానుల ప్రేమ, గౌరవం, దయ అవసరం అని తెలిపింది.     Also read:  ధురంధర్ తో కొత్త లోక  కలిస్తే.. మీకు ఓకేనా!     పదిహేడు సంవత్సరాల వయసులో మోడలింగ్ గా కెరీర్ ప్రారంభించిన మహి విజ్ టెలివిజన్   రంగంలో సుమారు 30 సిరీస్ ల వరకు చేసింది. గత ఏడాది డిసెంబర్ 2 నుంచి కలర్స్ టీవీ లో వస్తున్న సెహర్-హోనే కో హై లో చేస్తుంది. సినిమాల విషయానికి వస్తే 2004 లో తెలుగులో ప్రభు దేవా హీరోగా వచ్చిన తపన అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత మలయాళంలో, కన్నడంలో ఒక సినిమా చేసింది. ఇక  జై భానుషాలి విషయానికి వస్తే తను కూడా మోడల్ గానే  కెరీర్ స్టార్ట్ చేసి సినీ, టీవీ, వెబ్ సిరీస్  నటుడుగా, అనేక షోస్ కి ప్రెజంటర్ గా చేస్తు తనదైన శైలిలో దూసుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ మార్చిలో అభిషేక్ బచ్చన్ నుంచి వచ్చిన బి హ్యాపీ అనే మూవీలో కీలకమైన క్యారక్టర్ లో కనిపించాడు.  

ఈ సంక్రాంతికి ప్రదీప్ - సుధీర్ పెళ్లిళ్ల మీద పందేలు!

Publish Date:Jan 6, 2026

ఇంకొన్ని రోజుల్లో సంక్రాంతి పండగ రాబోతోంది. బుల్లితెరలో సందడి మొదలయ్యింది. రకరకాల షోస్ ని పండగ సందర్భంగా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ఇక జీ తెలుగులో సంక్రాంతి అల్లుళ్ళు పండగకు వస్తున్నారు" పేరుతో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒక షో ప్రసారం కాబోతోంది. దీనికి జడ్జెస్ గా ప్రదీప్-సుధీర్ ఉన్నారు.  "ప్రదీప్ ని సంక్రాంతికి అల్లుడిని చేసే బాధ్యత నాది" అంటూ హీరోయిన్ రోజా చెప్పింది. "సుధీర్ ని సంక్రాంతికి అల్లుడిని చేసే బాధ్యత నాది" అంటూ శేఖర్ మాష్టర్ చెప్పాడు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అనుకున్నారు. ఇక పెళ్లి కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ప్రదీప్ - సుధీర్ ఇద్దరూ వచ్చి "పందేలేదో కోళ్ల మీద వేసుకోవాలి కానీ మా పెళ్లిళ్ల మీద వేసుకుంటారేమిటి" అంటూ ఇద్దరూ అడిగేసారు.  ఇక ఈ ఈవెంట్ కి కూడా జీ లిటిల్ చాంప్స్ షోలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా ఉండే లిటిల్ సింగర్ వరుణవి కూడా వచ్చేసింది. దాంతో సుధీర్ వచ్చి "పండగ ఈవెంట్ లో కూడా అడుగు పెట్టేశావా" అని అన్నాడు. వెంటనే ఆ చిన్నారి "మనం అడుగు పెట్టాకే కదా పండగ మొదలయ్యేది" అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ షోకి మాస్ మహారాజ రవితేజ, కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు బుల్లితెర మీద కనిపించేవాళ్లంతా ఈ ఈవెంట్ కి వచ్చారు. "అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టి" అంటూ రవితేజ గురించి ఇంట్రడక్షన్ ని సుధీర్ ఇస్తూండేసరికి "మళ్ళీ మొదలు పెట్టాడురా బాబోయ్" అంటూ రవితేజ కామెడీగా అసహనం వ్యక్తం చేశారు. ఇక నెటిజన్స్ ఐతే సుధీర్ - ప్రదీప్ కాంబో చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. బెస్ట్ ఎంటర్టైనర్స్ అంతా కలిసి వచ్చారు. అబ్బా సూపర్ సుధీర్ ఉంటే చాలు. ఇంకా తోడుగా ప్రదీప్ రచ్చ రచ్చే..బొమ్మ అదుర్స్ కదు..టిఆర్పి పగిలిపోద్ది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

NBK 111: బాలయ్య ఫ్యాన్స్ కి ఊహించని షాక్!

Publish Date:Jan 5, 2026

  బాలకృష్ణ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ హిస్టారికల్ ఫిల్మ్ ని పక్కన పెట్టారా? NBK 111 కొత్త స్టోరీ ఏంటి? నయనతార ప్లేస్ లో ఎవరు?   'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 111వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. (NBK 111)   బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో హిస్టారికల్ ఫిల్మ్ అనగానే.. అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని వెండితెరపై చూస్తామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కి షాకిచ్చేలా.. ఈ మూవీ స్టోరీ ఛేంజ్ అయినట్లు సమాచారం.   ప్రస్తుతం పెద్ద సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. ఓటీటీ బిజినెస్ కూడా మునుపటిలా జరగడంలేదు. ఈ పరిస్థితులలో హిస్టారికల్ ఫిల్మ్ అయితే భారీ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో.. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టాలని టీమ్ నిర్ణయించిందట. దాని స్థానంలో మరో కొత్త స్క్రిప్ట్ తో సినిమా చేయబోతున్నారట. ఈ స్క్రిప్ట్ ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుందని, మలినేని ఈసారి అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు.   Also Read: రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా?   అలాగే 'NBK111' హీరోయిన్ కూడా మారనున్నట్లు వినికిడి. హిస్టారికల్ ఫిల్మ్ అనుకున్నప్పుడు హీరోయిన్ గా నయనతారను ప్రకటించారు. ఆమె రెమ్యూనరేషన్ రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఆమెకు బదులుగా మరో హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.   'NBK111' గురించి వినిపిస్తున్న వార్తల్లో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో బడ్జెట్ లు పెరిగిపోయి నష్టపోతున్నామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బడ్జెట్ విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయమే.  

Tiger Shroff to be part of Allu Arjun and Atlee film?

Publish Date:Jan 6, 2026

Allu Arjun has delivered a massive blockbuster with Pushpa 2 The Rule and his market in North India is huge. Taking that into consideration, Sun Pictures have accepted to give Atlee, a free hand to make his sci-fi fantasy drama on a never-seen-before scale with Hollywood VFX Studios, Action Co-ordinators collaborating on it.  Now, the reports suggest that the movie could be spilt into two parts and both will be shot at one go. The movie team won't be going back to shoot the second part but rather they would be spending 6-8 months on VFX and scale of the second part, if the reports are true.  Currently, the reports suggest that Tiger Shroff is in talks and he even joined the film for a crucial part. Will he be playing an antagonist or supporting protagonist is yet to be known. Vijay Sethupathi is said to be a part of the film. Already, Deepika Padukone is part of the film and she completed two schedules.  Mrunal Thakur and Janhvi Kapoor are said to be part of the project as there will be a triple role for Allu Arjun with connection between past lives and future. We have to wait and see, how many of these reports will emerge to be true. Atlee is currently working on meeting a Hollywood Studio to distribute the film, state reports.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969